Site icon NTV Telugu

Lava Blaze Dragon: కేవలం రూ.10,000 లోపే 6.74 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 50MP రియర్ కెమెరా.. లాంచ్ కు ముహర్తం ఫిక్స్..!

Lava Blaze Dragon

Lava Blaze Dragon

Lava Blaze Dragon: దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా (Lava) తాజాగా Blaze సిరీస్‌లో మరో కొత్త బడ్జెట్ ఫోన్‌ను తీసుకురావడానికి సిద్ధమైంది. Lava Blaze Dragon 5G పేరుతో ఈ ఫోన్‌ను కంపెనీ జూలై 25న అధికారికంగా విడుదల చేయనుంది. ఇప్పటికే స్టోర్మ్ (Strom) సిరీస్ తర్వాత ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లను కంపెనీ చాలానే ధృవీకరించింది. ప్రధానంగా ఈ ఫోన్‌లో ఎక్కువగా 5G బ్యాండ్లకు మద్దతు అందించనుందని లావా తెలిపింది. మరి ఈ బడ్జెట్ మొబైల్ విశేషాలను ఒకసారి చూసేద్దామా..

డిస్ప్లే అండ్ డిజైన్:
Blaze Dragon 5G ఫోన్‌లో 6.745 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే (1612 × 720 pixels) ఉండేలా డిజైన్ చేశారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 450+ నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. ఇది యూజర్లకు స్మూత్ స్క్రోలింగ్, మెరుగైన విజువల్ అనుభవాన్ని అందించనుంది.
ZEE5 :100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న ‘భైర‌వం’
ప్రాసెసర్:
ఈ ఫోన్‌లో Snapdragon 4 Gen 2 4nm మొబైల్ ప్లాట్‌ఫారమ్ ఉపయోగించబడింది. ఇందులో 2.2GHz A78 ఆధారిత 2 కోర్లు, 2GHz A55 ఆధారిత 6 కోర్లు ఉంటాయి. గ్రాఫిక్స్ కోసం Adreno 613 GPUను ఉపయోగిస్తున్నారు. దీని వల్ల రోజువారీ వాడుక యాప్‌లు, మీడియా వినోదం, లైట్ గేమింగ్‌కు మంచి పనితీరు అందుతుంది.

స్టోరేజ్:
Blaze Dragon 5G ఫోన్‌లో 4GB LPDDR4x RAM, 128GB UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. అంతేకాకుండా microSD కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1TB వరకు విస్తరించుకునే అవకాశం కూడా ఉంది.

కెమెరా:
ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్‌లో 50MP రియర్ కెమెరా లభించనుంది. LED ఫ్లాష్‌తో పాటు మంచి డిటైలింగ్ కలిగిన ఫోటోలను తీసేందుకు ఇది అనుకూలంగా ఉంటుంది. ముందుభాగంలో సెల్ఫీ కెమెరా వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.

బ్యాటరీ:
ఈ ఫోన్‌లో 5000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తోంది. అలాగే 3.5mm ఆడియో జాక్, FM రేడియో, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 5, Bluetooth 5.4, USB Type-C పోర్ట్, GPS + GLONASS వంటి కీలక ఫీచర్లు ఇందులో ఉంటాయి.
Fake Liquor: ఆంధ్ర-తెలంగాణలో కలకలం.. శానిటైజర్ స్పిరిట్‌తో కల్తీ విస్కీ తయారీ.. ఏడుగురు అరెస్ట్..!
ఆపరేటింగ్ సిస్టమ్:
Lava Blaze Dragon 5G తాజా Android 15 ఓఎస్‌తో రానుంది. ఇది తాజా ఫీచర్లతో పాటు భద్రతా అప్‌డేట్లకు కూడా మద్దతు అందిస్తుంది. ఈ ఫోన్‌ను గోల్డెన్ మిస్ట్, మిడ్ నైట్ మిస్ట్ అనే రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో అందించనున్నారు.

ధర:
మొబైల్ ధర విషయానికి వస్తే.. రూ.10,000 లోపుగా ఉండనుందని కంపెనీ తెలిపింది. ఫోన్‌ను అమెజాన్, లావా వెబ్ సైట్ లో విక్రయించనున్నారు.

Exit mobile version