Site icon NTV Telugu

Latest Weather Report: లేటెస్ట్‌ వెదర్‌ రిపోర్ట్.. వర్షాలే వర్షాలు..

Rains

Rains

Latest Weather Report: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వర్షాలు దంచికొడుతున్నాయి.. హైదరాబాద్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, నిజామాబాద్‌ లాంటి జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి.. ఏపీలో నూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి.. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ, అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది..

దక్షిణ వాయువ్య మరియు దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఒడిశా-ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ తీరాల వద్ధ గల అల్పపీడన ప్రాంతం మరియు దాని అనుబంధ ఉపరితల అవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి మరియు ఎత్తుతో నైరుతి వైపు వంగి ఉంటుంది. ఇది దాదాపు పశ్చిమ దిశగా కదులుతూ రాగాల 24 గంటలలో దక్షిణ ఒడిశా మరియు దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది. ఋతుపవన ద్రోణి యొక్క పశ్చిమ చివర భాగం హిమాలయ పాద ప్రాంతము వద్ద కొనసాగుతున్నది మరియు తూర్పు చివర ఇప్పుడు నజీబాబాద్, లక్నో, సత్నా, రాయ్‌పూర్ మరియు అక్కడి నుండి ఆగ్నేయ దిశగా అల్పపీడన ప్రాంతం నుండి వాయువ్య మరియు పరిసర ప్రాంతాలు అనగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం అనగా దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద ఉందని సూచింది.. ఒక ద్రోణి సగటు సముద్ర మట్టము నుండి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడి వాయువ్య మరియు దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం అనగా దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్ర ప్రాంతంపై గల అల్ప పీడన ప్రాంతంతో కలసిన ఉపరితల అవర్తనం నుండి ఒడిశా మరియు ఛత్తీస్‌గఢ్ మీదుగా ఆగ్నేయ ఉత్తర ప్రదేశ్ వరకు కొనసాగుతుండగా.. అల్ప పీడన ప్రాంతంతో కలసి కొనసాగుతున్న ఉపరితల అవర్తనం వరకు అనగా ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మీదుగా తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టం నుండి 1.5 నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడిన ద్రోణి ఇప్పుడు బాలహీనపడినట్టు తెలిపింది.

అయితే, దీని ప్రభావంతో.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది వాతావరణ శాఖ.. ఇక, రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఓసారి గమనిస్తే.. ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉండగా.. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది . బలమైన గాలులు గంటకు 30 నుండి 40 కిలో మీటర్ల వేగంతో వీయ వచ్చును అని తెలిపింది. ఇక, రేపు అనగా ఈ నెల 6వ తేదీన తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉండగా.. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది . బలమైన గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగతంతో వీయ వచ్చు అని అంచనా వేసింది. ఎల్లుండి అనగా ఈ నెల 7వ తేదీన తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ.

ఇక, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. ఈరోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించనుండగా.. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీయ వచ్చు. ఈ నెల 6వ తేదీన తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటరు వేగంతో వీయ వచ్చు అని అంచనా వేసింది. ఈ నెల 7వ తేదీన తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉండగా.. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

మరోవైపు రాయలసీమ విషయానికి వస్తే.. ఈరోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది . బలమైన గాలులు గంటకు 30 నుండి 40 కిలో మీటరు వేగంతో వీయవచ్చును.. ఈ నెల 6వ తేదీన తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీయవచ్చును.. ఇక, 7వ తేదీన తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందనా భారత వాతావరణశాఖ అంచనా వేసినట్టు అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Exit mobile version