Site icon NTV Telugu

Pakistan Army Terror Links: ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఆర్మీ సపోర్ట్.. ఈ వీడియోనే సాక్ష్యం!

Pakisthan

Pakisthan

Pakistan Army Terror Links: పాకిస్థాన్ సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య సానిహిత్య సంబంధం ఉందనే విషయం బహిరంగ రహస్యమే. అయితే.. ఈ వాదన మరోసారి బలపడింది. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన లష్కర్-ఎ-తోయిబా ఉగ్రసంస్థ డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి వీడియో వెలుగులోకి వచ్చింది. వైరల్‌గా మారిన ఈ వీడియోలో పాకిస్థాన్‌ సైన్యంతో తనకు ఉన్న సన్నిహిత సంబంధాలను కసూరి బహిరంగంగానే గొప్పగా చెప్పుకున్నాడు. ఈ దృశ్యాలను గూఢచార సంస్థలు ధృవీకరించాయి. వీడియో ఎప్పుడు తీసిందన్నది స్పష్టంగా లేకపోయినా, భారత్‌కు ఎదురవుతున్న ముప్పును ఇది మరోసారి బయటపెట్టింది.

READ MORE: ED vs West Bengal Govt: ఈడీ vs బెంగాల్ ప్రభుత్వం.. సుప్రీంకోర్టుకు చేరిన వివాదం..

ఎర్ర బెలూన్లతో అలంకరించిన ఓ పాఠశాల కార్యక్రమంలో వేదికపై నిలబడి మాట్లాడిన కసూరి.. “పాకిస్థాన్‌ ఆర్మీ నన్నే పిలిచి జనాజా నమాజ్ నడిపించమంటుంది” అంటూ గర్వంగా చెప్పాడు. అంతేకాదు.. భారత్ తనను భయపడుతుందని తెలిపాడు. ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్‌లో ఉగ్రవాదానికి రాజ్యాంగ రక్షణ ఉందన్న భారత ఆరోపణలకు మరో సాక్ష్యంగా మారాయి. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం దాడికి ప్రధాన సూత్రధారి అయిన కసూరి.. 26 మంది పర్యాటకులు ప్రాణాలను బలిగొన్నాడు. అలాంటి వ్యక్తి ఓ పాఠశాల వేదికపై బహిరంగంగా మాట్లాడడం, పిల్లల ముందే ఉగ్ర భావజాలాన్ని ప్రచారం చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పహల్గాం దాడికి ప్రతిస్పందనగా భారత్ ఆరు నెలల క్రితం ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టి ఉగ్ర శిబిరాలపై దాడులు చేసింది.

READ MORE: The Rajasaab: ప్రభాస్ ‘రాజాసాబ్’పై కాపీ ఆరోపణలు.. తమన్‌కు విదేశీ డీజే వార్నింగ్

అయితే ఆ తర్వాత పాకిస్థాన్‌ మద్దతుతో లష్కర్, జైష్ వంటి సంస్థలు మళ్లీ దాడులకు సిద్ధమవుతున్నాయన్న హెచ్చరికలు గూఢచార సంస్థల నుంచి వస్తున్నాయి. కసూరి తాజా ప్రసంగం కూడా అదే దిశగా సంకేతాలు ఇస్తోందని అధికారులు భావిస్తున్నారు. ఈ పరిణామాలను భారత్ తీవ్ర హెచ్చరికగా పరిగణిస్తోంది. ఉత్తర కమాండ్ పరిధిలో సైన్యం, భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపకపోతే ‘ఆపరేషన్ సిందూర్’ తదుపరి దశ అమలు తప్పదని భారత్ స్పష్టం చేసింది. కసూరి వీడియో, పాకిస్థాన్‌ పాత్రపై భారత్ చేస్తున్న ఆరోపణలకు బలమైన ఆధారంగా మారింది.

Exit mobile version