NTV Telugu Site icon

Land Purchase Ban : ఆ రాష్ట్రంలో బయటి వ్యక్తులు వ్యవసాయ భూమిని కొనడం నిషేధం

New Project (35)

New Project (35)

Land Purchase Ban : పర్వతాలలో భూమిని కాపాడటానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వ్యవసాయం, ఉద్యానవనాల కోసం బయటి వ్యక్తులు భూమిని కొనుగోలు చేయకుండా నిషేధించింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

వ్యవసాయం, హార్టికల్చర్ భూమిపై మాత్రమే పరిమితులు
వ్యవసాయం, హార్టికల్చర్ భూములపై మాత్రమే ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిషేధం విధించబడింది. ఈ నిషేధం సహాయంతో రాష్ట్ర వాసుల ప్రయోజనాలు పరిరక్షించబడతాయి. అలాగే, ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఇది భూమికి సంబంధించిన చట్టాలపై ప్రభుత్వానికి తన నివేదికను సమర్పిస్తుంది. వ్యవసాయం లేదా ఉద్యానవనాల కోసం ఇతర రాష్ట్రాల నివాసితులకు భూమిని విక్రయించడాన్ని ఆమోదించవద్దని అన్ని జిల్లాల డీఎంలను ఆదేశించింది.

Read Also:Turky : ఇజ్రాయెల్ పై టర్కీ భారీ చర్య.. 33మంది మొస్సాద్ గూఢచారుల అరెస్టు

డీఎం ఆమోదంతో మాత్రమే భూమి కొనుగోళ్లు
2024 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ జమీందారీ నిర్మూలన, భూ సంస్కరణల చట్టం 1950లోని సెక్షన్ 154లో మార్పులు చేయబడ్డాయి. దీని ప్రకారం, డీఎం ఆమోదంతో రాష్ట్రంలో సెప్టెంబర్ 12, 2003కి ముందు ఆస్తి లేని వ్యక్తులు వ్యవసాయం లేదా ఉద్యానవనాల కోసం భూమిని కొనుగోలు చేయవచ్చు. ఇప్పుడు దీన్ని నిషేధించారు. ప్రజలు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది.

కొత్త సంవత్సరం సందర్భంగా పుష్కర్ సింగ్ ధామి మీడియాతో మాట్లాడుతూ.. ఏదైనా భూ ఒప్పందానికి ముందు కొనుగోలుదారుడి నేపథ్యాన్ని తనిఖీ చేయాలని గత ఏడాది మేలో నిర్ణయించుకున్నామని చెప్పారు. అంతేకాకుండా భూమిని కొనుగోలు చేయడానికి గల కారణాలను కూడా విచారించనున్నారు. ఇప్పుడు వ్యవసాయ భూముల అమ్మకాలను నిషేధించాం. మిగిలిన అన్ని డీల్‌ల కోసం ధృవీకరణ కొనసాగుతుంది.

Read Also:Chelluboina Venu Gopala Krishna: ట్రబుల్‌ షూటర్‌ని కాబట్టే నన్ను రాజమండ్రి రూరల్‌కి పంపారు..

ఐదుగురు సభ్యులతో కమిటీ
ప్రభుత్వం డిసెంబర్ 22, 2023న అదనపు ప్రధాన కార్యదర్శి రాధా రాటూరి నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన ల్యాండ్ లా కమిటీని కూడా ఏర్పాటు చేసింది. డిసెంబర్ 24న డెహ్రాడూన్‌లో 1950ని నివాస కటాఫ్ తేదీగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేపట్టారు.

Show comments