Paris Olympics 2024: భారత బ్యాడ్మింటన్‌లో చరిత్రాత్మక విజయం.. క్వార్టర్ ఫైనల్స్‌కు లక్ష్యసేన్
- బ్యాడ్మింటన్‌లో పురుషుల సింగిల్స్ సెమీ-ఫైనల్‌కు చేరుకున్న లక్ష్య సేన్
- ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచిన లక్ష్య సేన్
- 19-21.. 21-15.. 21-12తో తైవాన్‌కు చెందిన చు టిన్ చెన్పై విజయం
- భారత బ్యాడ్మింటన్‌లో లక్ష్యసేన్ చరిత్రాత్మక విజయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లక్ష్య సేన్ బ్యాడ్మింటన్‌లో పురుషుల సింగిల్స్ సెమీ-ఫైనల్‌కు చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా లక్ష్య సేన్ నిలిచాడు. లక్ష్య 19-21, 21-15, 21-12తో తైవాన్‌కు చెందిన చు టిన్ చెన్పై విజయం సాధించాడు. భారత బ్యాడ్మింటన్‌లో లక్ష్యసేన్ చరిత్రాత్మక విజయం సాధించాడు. క్వార్టర్-ఫైనల్స్‌లో చైనీస్ తైపీకి చెందిన చు టిన్ చెన్పై మూడు గేమ్‌ల ఉత్కంఠభరితమైన గెలుపు పొందాడు. సేన్ ఇంతకు ముందు ఏ భారతీయ పురుష షట్లర్ చేరుకోని మైలురాయిని చేరుకున్నాడు. ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో సెమీఫైనల్‌కు చేరిన తొలి భారతీయ పురుష షట్లర్‌గా లక్ష్య ఇప్పుడు నిలిచాడు. ఇప్పుడు అతను పతకానికి కేవలం ఒక గెలుపు దూరంలో ఉన్నాడు. లక్ష్య కంటే ముందు కిదాంబి శ్రీకాంత్ (2016), పారుపల్లి కశ్యప్ (2012) క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. పారిస్ నుంచి బ్యాడ్మింటన్ పతకంపై భారత్‌కు సేన్ మాత్రమే ఆశ ఉంది.
Read Also: Off The Record : ఆ నాయకుడు రాజకీయాలకు స్వస్తి చెప్పేశారా..?
Also Read
- Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- 150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్‌ఫైనల్స్‌లో లక్ష్య సేన్ ప్రణయ్‌ను ఓడించి క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు. గురువారం జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 19వ ర్యాంకర్ లక్ష్య 13వ ర్యాంకర్ ప్రణయ్‌పై విజయం సాధించాడు. దీంతో పారిస్ ఒలింపిక్స్‌లో ప్రణయ్ ప్రయాణం ముగిసింది. ఈ మ్యాచ్‌లో తొలి సెట్లో లక్ష్య విజయం సాధించాడు. 21 నిమిషాల పాటు సాగిన ఈ గేమ్‌లో 21-12తో ప్రణయ్‌పై విజయం సాధించాడు. అదే సమయంలో.. రెండవ సెట్లో కూడా లక్ష్య జోరు ప్రదర్శించి 18 నిమిషాల పాటు సాగిన గేమ్‌లో 21-6తో ప్రణయ్‌పై విజయం సాధించి మ్యాచ్‌ను గెలుచుకున్నాడు. 21-18, 21-12 తేడాతో ఇండోనేషియాకు చెందిన ప్రపంచ నాలుగో ర్యాంకర్ జోనాథన్ క్రిస్టీపై ప్రణయ్‌పై లక్ష్య సేన్ విజయం సాధించాడు.
Read Also: BSF: పారామిలటరీ ఫోర్స్ బీఎస్ఎఫ్ చీఫ్, డిప్యూటీ చీఫ్‌ల తొలగింపు..
లక్ష్య సేన్ సాధించిన విజయాలు:
గత కొన్ని సంవత్సరాలుగా లక్ష్య సేన్‌కు చాలా గొప్పది. 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో లక్ష్య బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. 2021లో హుయెల్వాలో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ పురుషుల సింగిల్స్‌లో లక్ష్య కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. కిదాంబి శ్రీకాంత్‌పై ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత.. థామస్ కప్‌లో పురుషుల జట్టుతో లక్ష్య స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. ఆ తర్వాత.. బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల సింగిల్స్‌లో స్వర్ణం, మిక్స్డ్ జట్టుతో రజతం సాధించాడు. అంతకుముందు, మనీలాలో జరిగిన ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్‌లో లక్ష్య కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. అదే సమయంలో.. 2018లో బ్యూనస్ ఎయిర్స్లో జరిగిన యూత్ ఒలింపిక్స్‌లో లక్ష్య రజత పతకాన్ని గెలుచుకున్నాడు. 2018లో ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించాడు. 2018లో స్వర్ణం, 2016లో ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించాడు.
తాజావార్తలు
-
Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Protein Food : అమ్మ జ్ఞాపకం.. కేవలం 5 నిమిషాల్లో తయారయ్యే రుచికరమైన లావోటియన్ ‘ఎగ్ హాష్’!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
ట్రెండింగ్
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!