Site icon NTV Telugu

Lakshadweep MP: హత్యాయత్నం కేసులో లక్షద్వీప్ ఎంపీకి పదేళ్ల జైలుశిక్ష

Lakshadweep Mp

Lakshadweep Mp

Lakshadweep MP: హత్యాయత్నం కేసులో లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ సహా నలుగురికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ లక్షద్వీప్ కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. 2009లో నమోదైన హత్యాయత్నం కేసులో దోషులకు కవరత్తిలోని జిల్లా, సెషన్స్ కోర్టు ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున జరిమానా విధించిందని కేసుకు సంబంధించిన న్యాయవాదులు తెలిపారు.

Quli Qutub Shah Stadium : శిథిలావస్థలో కులీ కుతుబ్ షా స్టేడియం.. పట్టించుకునే వారెవరు..?

న్యాయవాదుల ప్రకారం.. 2009 లోక్‌సభ ఎన్నికల సమయంలో రాజకీయ సమస్యపై జోక్యం చేసుకున్నందుకు తమ ప్రాంతానికి చేరుకున్న మాజీ కేంద్ర మంత్రి పీఎం సయీద్ అల్లుడు పదనాథ్ సలీహ్‌పై ఎంపీ, ఇతరులు దాడి చేశారు. ఈ తీర్పుపై స్పందించిన ఎంపీ మహమ్మద్ ఫైజల్.. ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అని, త్వరలో ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేస్తానని చెప్పారు.

Exit mobile version