ఇక మాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డ్ ను తన పేరుతో రాసుకున్న మోహన్ లాల్ ఇటీవల తుడరమ్‌తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు హృదయపూర్వం అనే మరో ఫ్యామిలీ డ్రామాతో ఓనమ్ సీజన్‌లోనే బరిలోకి దిగుతున్నారు. నేడు హృదయ పూర్వం రిలీజ్ వరల్డ్ వైడ్ గ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే డబుల్ మూవీస్‌తో, డబుల్ హండ్రెడ్ క్రోర్ చిత్రాలను దింపిన లాలట్టన్.. మరో హ్యాట్రిక్ హిట్ అందుకుంటారేమో చూడాలి.
Also Read : PEDDI : ‘పెద్ది’.. రామ్ చరణ్ ఇంట్రో కోసం భారీ ప్లాన్
ఇక ఇదే ఓనమ్ పండుగకు కళ్యాణీ ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించిన సూపర్ ఉమెన్ కాన్సెప్ట్ సినిమా ‘లోక’ కూడా నేడే రిలీజ్ అవుతోంది. మిన్నల్ మురళి ఇచ్చిన ఇన్ఫిరేషన్‌తో సిద్దమైన ఈ ఫస్ట్ సూపర్ ఉమెన్ కథకు సుమారు రూ. 30 కోట్ల బడ్జెట్ తో నిర్మించాడు దుల్కర్ సల్మాన్. కళ్యాణీ ప్రియదర్శన్, ప్రేమలు ఫేమ్ నస్లేన్ హీరో హీరోయిన్స్ గా నటించారు.పాన్ ఇండియా లెవల్లో పలు భాషల్లో రిలీజౌతున్న ఈ సినిమా తెలుగులో కోత లోక పేరుతో వస్తోంది. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ లో మోహన్ లాల్ తో పోటీపడుతోని లోక. మోహన్ లాల్ హృదయపూర్వం 1224 షో కు గాను ₹1.61 కోట్ల గ్రాస్ వసూళ్లను అడ్వాన్స్ బుకింగ్స్ లో రాబెట్టింది. 2025లో ఎంపురాన్ మరియు తడరమ్ తర్వాత మలయాళం చిత్రం 3వ బెస్ట్ ఓపెనింగ్ అడ్వాన్స్ వసూళ్లు రాబట్టిన సినిమాగా హృదయపూర్వం నిలిచింది. అటు లోక సినిమా కేరళ లో 1103 షోస్ కు గాను రూ. 80 లక్షల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి దూసుకెళ్తోంది. ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన హీరోతో లేడి ఓరియంటెడ్ ఫిల్మ్ పోటీగా వసూళ్లు రాబట్టడం అంటే సూపర్ అనే చెప్పాలి. రెండు సినిమాలు ఉదయం ఆటతో నేడు విడుదలయ్యాయి.
