NTV Telugu Site icon

Kurnool Road Accident: కర్నూలులో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు!

Accident

Accident

2 Dead and 5 injured in Kurnool Road Accident Today: కర్నూలు జిల్లా హాలహర్వి మండలంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అటుగా వెళుతున్న ప్రయాణికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు.

కర్ణాటకలోని బళ్లారి నుంచి ఏడుగురు యువకులు కారులో మంత్రాలయం బయలుదేరారు. కర్నూలు జిల్లా హాలహర్వి మండలం చింతకుంట గ్రామ శివారు వద్ద కారు ఒక్కసారిగా అదుపుతప్పి.. బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు.

Also Read: Mancherial: ప్రతిపక్షాల స్వ’రక్షణ’ కోసమే మాతా, శిశు సంరక్షణ కేంద్రంపై ఆరోపణలు: బీఆర్ఎస్

తీవ్ర గాయాలు అవ్వడంతో మెరుగైన వైద్యం కోసం యువకులను బళ్లారికి తరలించారు. సమాచారం అందుకున్న హాలహర్వి మండల పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. మృతదేహాలను ఆలూరు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. యువకులు వేగంగా వెళ్లడమే ఈ ప్రమాదానికి కారణం అని పోలీసులు భావిస్తున్నారు.

Show comments