Site icon NTV Telugu

Bus Accident: కర్నూలు జిల్లాలో పూర్తిగా దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. నిద్రలోనే మృత్యు ఒడికి ప్రయాణికులు..

Hyd

Hyd

Bus Accident: కర్నూలు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద వేమూరి కావేరి ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు పూర్తిగా దగ్ధమైంది. శుక్రవారం వేకువజామున 3.30 గంటలకు ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తొలుత బస్సు ముందు భాగంలో మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత క్రమంగా బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. మంటలు చెలరేగడంతో 12 మంది ప్రయాణికులు అత్యవసర ద్వారాన్ని పగలగొట్టి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీ వర్షం కురిసింది.

READ MORE: Astrology: అక్టోబర్‌ 24, శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..

అయితే.. హైదరాబాద్ నుంచి వెళ్తున్న ఈ బస్సు కర్నూలు నగర శివారులో ఉలిందకొండ సమీపంలోకి రాగానే వెనక నుంచి వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఆ ద్విచక్రవాహనం పెట్రోల్ ట్యాంక్ లీక్ అయ్యి మంటలు చెలరేగాయి. ఆ బైకు బస్సు కిందికి వెళ్లి మంటలు చెలరేగాయి. అప్పటికే నిద్రలో ఉన్న ప్రయాణికుల్లో కొందరు బయటపడ్డారు. మరికొందరు మంటల్లోనే చిక్కుకుని మరణించారు. ప్రయాణికుల్లో హైదరాబాద్‌కి చెందిన వాళ్లే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.

READ MORE: Off The Record: రాజగోపాల్ రెడ్డి మునుగోడు మద్యం వ్యాపారానికి షరతులు పెట్టారా?

ఈ ఘటనపై కర్నూలు ఎస్పీ స్పందించారు. “3 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తున్న రన్నింగ్ బస్ ఒక బైక్ ను ఢీ కొట్టింది. వెంటనే బస్ లో మంటలు చెలరేగాయి.. డ్రైవర్ గమనించి.. స్పేర్ డ్రైవర్ ను నిద్ర లేపాడు. చిన్న ప్రమాదం అని భావించారు. డ్రైవర్ సీటు వద్ద ఉన్న వాటర్ బబుల్ లో ఉన్న నీటితో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.. మంటలు ఎక్కువయ్యే సరికి ప్రయాణికులను నిద్ర లేపారు.. ఎమర్జెన్సీ డోర్ లను బద్దలు కొట్టి కొందరు బయటకు వచ్చారు.. కొందరు కిటికీల ద్వారా బయటకు వచ్చారు.. ప్రస్తుతం ఎంతమంది చనిపోయారు అనేది చెప్పలేం.” అని వెల్లడించారు.

 

Exit mobile version