NTV Telugu Site icon

Bharateeyudu 2: భారతీయుడు 2లో కుర్చీ మడత పెట్టిన గేమ్ ఛేంజర్!

Kurchi Madathapetti Jabilama Bharatheeyudu 2

Kurchi Madathapetti Jabilama Bharatheeyudu 2

Kurchi Madatha Petti and jabilamma Songs in Bharateeyudu 2: కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా భారతీయుడు 2 తెరకెక్కింది. అనౌన్స్ చేసిన నాటి నుంచి అనేక అంచనాలు ఈ సినిమా మీద ఏర్పడ్డాయి. ఈ సినిమా ఎట్టకేలకు జూలై 12వ తేదీ అంటే ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత మొదటి ఆట నుంచి సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది. కొంతమంది ఏమాత్రం బాలేదు అంటుంటే కొంతమంది మాత్రం పరవాలేదు అంటున్నారు. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన న గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి సాంగ్ తో పాటు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలోని జాబిలమ్మ జాకెట్టు ఏసుకొచ్చెనండి అనే సాంగ్ బిట్స్ వినిపించారు.

Mrunal Thakur Pic: ‘దివ్య’గా మృణాల్ ఠాకూర్.. కొత్త ఫోటో వైరల్!

ఒక చిన్న సీన్లో బస్టాండ్ లో ఈ పాటలు వచ్చేలా ప్లే చేశారు. అయితే సినిమాలోని పాటలకు పెద్దగా రియాక్ట్ కాని ప్రేక్షకులు ఈ రెండు పాటలు వచ్చినప్పుడు మాత్రం గట్టిగానే రియాక్ట్ అయ్యారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ కాగా సినిమాలో ప్లే చేసిన అటు గుంటూరు కారం సాంగ్ తో పాటు గేమ్ చేంజర్ సాంగ్స్ కంపోజ్ చేసింది మాత్రం సంగీత దర్శకుడు థమన్. ఇక గేమ్ చేంజర్ సినిమా కూడా శంకర్ దర్శకత్వంలోనే తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించి ఇంకా పది పదిహేను రోజుల షూటింగ్ మిగిలి ఉందని అది పూర్తయిన తర్వాత సినిమా రిలీజ్ చేసే విషయం గురించి మాట్లాడతామని శంకర్ భారతీయుడు 2 ప్రెస్ మీట్ లో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

Show comments