NTV Telugu Site icon

Kunamneni Sambasiva Rao : ఇంతటి కష్టకాలంలో ఇంత పెద్ద బడ్జెట్ పెట్టడం సాహసోపేతం

Kunamneni Sambasiva Rao

Kunamneni Sambasiva Rao

తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేడు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే.. ఈ సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద సీపీఐ ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు మాట్లాడుతూ.. ఇంతటి కష్టకాలంలో ఇంత పెద్ద బడ్జెట్ పెట్టడం సాహసోపేతమని ఆయన అన్నారు. ప్రభుత్వం మా బడ్జెట్ చాలా గొప్పది అంటారని , ప్రతిపక్షాలు విమర్శలు చేస్తాయని, మేము కమ్యూనిస్టులాము 6లక్షల 70వేల కోట్ల అప్పుల్లో ఇంతకు మించి చేయడానికి ఇంకా ఏం లేదన్నారు. వ్యవసాయానికి, రైతు బంధు, రుణమాఫీ కి ఎక్కువ బడ్జెట్ కేటాయించారని, విద్య వైద్యానికి 15 శాతం ఉండాల్సిన అవసరం ఉందన్నారు కూనంనేని. కానీ ఆ అవకాశం లేకపోయిందని, భవిష్యత్ లో అయిన విద్య, వైద్యానికి కేటాయించిన నిధులు పెంచాలన్నారు కూనంనేని సాంబశివరావు.

Atal Setu Bridge: ఏమైందో పాపం.. అటల్ సేతుపై నుంచి దూకి ఇంజనీర్ ఆత్మహత్య.. వీడియో వైరల్..

అంతేకాకుండా.. ఆ డబ్బులు అవినీతి పలు అయ్యాయా.. పెట్టుబడులు పెట్టరా.. రోడ్లు భావనలకు పెట్టరా తెలియాలి. ఆ అప్పుకు వడ్డీలు కూడా కట్టాల్సిన పరిస్తితి వచ్చింది. చేసిన అప్పులు ఎలా ఉపయోగించారు అనేది షార్ట్ డిస్కర్ష్షన్ పెట్టీ.. శ్రేత పత్రం పెట్టాలన్నారు. ఇదిలా ఉంటే నిన్న.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. అసెంబ్లీలో కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ… కేంద్రం తాము నిధులు ఇచ్చాం.. ఇచ్చాం అని అనడం సరికాదన్నారు. రాష్ట్రాలు ఇవ్వకపోతే.. కేంద్రానికి నిధులు ఎక్కడ అని ప్రశ్నించారు. కేంద్రం జీఎస్టీ తెచ్చి రాష్ట్రాలను యాచకులుగా మార్చిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజల సొమ్ముకు ధర్మకర్తలు మాత్రమే అన్నారు. కేంద్రం అనేది మిథ్య.. అని ఆనాడ్ ఎన్టీఆర్ అందుకే అన్నారని గుర్తు చేశారు. దేశానికి నేడు రాజనీతిజ్ఞుల కొరత ఉందని అభిప్రాయపడ్డారు కూనంనేని సాంబశివరావు.

London: భారత్ లో చిన్నపాటి వర్షాలకే రోడ్లు జలమయం..లండన్ లో ఇలా ఎందుకు జరగదు?