kumbhotsavam 2024: శ్రీశైలంలో ఈనెల 26న శ్రీభ్రమరాంబికాదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు.. ఇక, కుంభోత్సవ ఏర్పాట్లపై స్థానిక రెవిన్యూ,పోలీస్ అధికారులతో ఆలయ ఈవో పెద్దిరాజు సమీక్షా సమావేశం నిర్వహించారు.. 26న కుంభోత్సవం రోజు అమ్మవారికి సాత్విక బలిగా గుమ్మడి, కొబ్బరి, నిమ్మకాయలు, అన్నపురాసి సమర్పించనున్నారు.. క్షేత్రంలో జీవహింస నిషిద్ధం కారణంగా జంతు, పక్షు బలులు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు.. మాడవీధులు, అంకాళమ్మ, పంచమఠాలు, మహిషాసురమర్ధిని ఆలయాల వద్ద సిబ్బంది గస్తీకి ప్రత్యేక విధులు విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.. కుంభోత్సవం రోజు సుండిపెంటలో మద్యం దుకాణాలు నిలిపివేసేలా జిల్లా కలెక్టర్ ని కోరనున్నట్టు ఈ సందర్భంగా వెల్లడించారు శ్రీశైలం ఆలయం ఈవో పెద్దిరాజు. కాగా, ఉగాది సందర్భంగా శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలను ఘనంగా నిర్వహించిన విషయం విదితే.. పెద్ద సంఖ్యలో కర్ణాటక భక్తులు రావడంతో శ్రీశైలం క్షేత్రం ఉగాది మహోత్సవాల కాలంలో కిటకిటలాడింది.. ఆ తర్వాత పారిశుద్ధ్య కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టిన ఆలయ అధికారులు.. ఇప్పుడు అమ్మవారి కుంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Also: Premalu 2: యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కి సీక్వెల్ రెడీ అవుతోంది.. రిలీజ్ ఎప్పుడంటే?