ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పేరు కుమారీ ఆంటీ.. మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి సమీపంలో స్ట్రీడ్ ఫుడ్ బిజినెస్ చేసే ఆమె యూట్యూబ్ వల్ల బాగా పాపులారిటిని సొంతం చేసుకుంది. అతి తక్కువ కాలంలోనే సోషల్ మీడియా సెలెబ్రేటీ అయిపొయింది.. అంతేకాదు ఆమె డైలాగును కూడా తెగ వాడేస్తున్నారు.. అతి తక్కువ కాలంలోనే సోషల్ మీడియాలో స్టార్ గా మారింది.. ఇటీవల ఓ సీరియల్ లో కనిపించిన ఈమె తన చదువు గురించి ఎమోషనల్ స్పీచ్ తో అందరిని ఆకట్టుకుంది..
ఆమె తాజాగా ఓ ఈవెంట్ కు హాజరైంది.. ఈ కార్యక్రమానికి పెద్ద పెద్ద స్టార్స్ హాజరైయ్యారు.. ఈ సందర్బంగా స్టేజ్ పైకి ఎక్కి మాట్లాడిన కుమారి ఆంటీ ఎమోషనల్ అయ్యింది.. ఆమె మాట్లాడుతూ.. తన ఆనందాన్ని, భావోద్వేగాన్ని పంచుకుంది. అంతేకాదు ఇన్‌స్పైర్ చేసే పద్యంతో అందరిని ఆకట్టుకుంది.. నాకు ఈమధ్య వరుస షాక్ ఎదురవుతున్నాయి.. ఇంతటి పాపులారిటీని ఊహించలేదు. నేను ఎక్కడ ఉంటానో, ఏం చేస్తానో నాది నాకే తెలియదు. ప్రపంచం అంటే ఏంటో తెలియని నాకు ఈ రోజు ఇంత మందిలోకి తీసుకొచ్చారంటే నిజంగా సోషల్ మీడియాకి థ్యాంక్స్ అని చెప్పింది.. అలాగే చదువు పై ఒక పద్యం చెప్పింది..
చదువు లేదని ఎప్పుడు బాధపడవద్దు.. భక్తికి ముక్తికి చదువులెందుకు. ఆత్మ శాంతి ఉంటే అదే ధైవమూ, చెరువులోనా చేపకెవరు ఈత నేర్పిరి.. అంటూ చెప్పుకొచ్చింది.. ఆ మాటలకు అందరు ఫిదా అయ్యారు.. అంతేకాదు ఆమెను అభినందించారు.. మా అమ్మానాన్న ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే, ప్రతిఫలం ఆశించకుండా ముందుకు సాగితే అంతా మంచే జరుగుతుందని తెలిపారు.. పెద్దలు చెప్పిన మాటలు ఎప్పుడు వృధా కావు నా విషయం అది నిజమైందని చెప్పి ఎమోషనల్ అయ్యింది. అందుకు సంబందించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..