Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Kuldeep Yadav Says Iam Not Married Bollywood Actress

Kuldeep Yadav Marriage: బాలీవుడ్ నటితో పెళ్లి.. కుల్దీప్ యాదవ్‌ ఏమన్నాడంటే?

Published Date :July 8, 2024 , 11:17 am
By Sampath Kumar
  • టీ20 ప్రపంచకప్‌లో 10 వికెట్లు
  • కాన్పూర్‌లో ఘనస్వాగతం
  • కుల్దీప్ యాదవ్‌ తీపి కబురు
Kuldeep Yadav Marriage: బాలీవుడ్ నటితో పెళ్లి.. కుల్దీప్ యాదవ్‌ ఏమన్నాడంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kuldeep Yadav Rect on Marriage with Bollywood Actress: టీ20 ప్రపంచకప్ 2024 విజయోత్సవ సంబరాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీ, ముంబైలలో వేడుకల అనంతరం భారత జట్టు ఆటగాళ్లకు వారి వారి సొంత నగరాల్లో అభిమానులు ఘనమైన స్వాగతం పలుకుతున్నారు. భారత్‌ను చాంపియన్‌గా నిలబెట్టడంలో కీలకపాత్ర పోషించిన మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు సొంతగడ్డ కాన్పూర్‌లో ఘనస్వాగతం లభించింది. అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చి.. టపాసులు, డోలు చప్పుళ్ల మధ్య ఊరేగిస్తూ తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కుల్దీప్ తన వ్యక్తిగత జీవితం గురించి కీలక విషయం తెలిపాడు.

తాను త్వరలో వివాహం చేసుకోబోతున్నానంటూ అభిమానులకు కుల్దీప్ యాదవ్‌ తీపి కబురు చెప్పాడు. అయితే బాలీవుడ్ నటిని వివాహం చేసుకోబోతున్నానంటూ వచ్చిన వార్తలను కుల్దీప్ కొట్టిపారేశాడు. కుల్దీప్ ఓ జాతీయ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ.. తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి సినిమా రంగానికి చెందిన వ్యక్తి కాదని స్పష్టం చేశాడు. తనను, తన కుటుంబాన్ని బాగా చూసుకునే అమ్మాయి జీవితంలోకి రావడం చాలా ముఖ్యమని అతడు అభిప్రాయపడ్డాడు. దీనిపై త్వరలోనే అందరికీ శుభవార్త చెబుతానని 29 ఏళ్ల కుల్దీప్ చెప్పుకొచ్చాడు.

Also Read: Maharaja OTT: విజయ్ సేతుపతి ‘మహారాజా’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

టీ20 ప్రపంచకప్ గెలవడంపై కుల్దీప్ యాదవ్‌ సంతోషం వ్యక్తం చేశాడు. ‘ఈ క్షణాల కోసం నేను చాలా కాలం నుంచి వేచి చూస్తున్నా. వ్యక్తిగతం కంటే కూడా జట్టుగా ఈ కప్‌ భారత్‌కు చాలా అవసరం. ప్రధాని నరేంద్ర మోడీని కలవడం చాలా ఉత్సాహం నింపింది. ఈ రోజులను నేను ఎప్పటికీ మర్చిపోను. భారత్ విజయంలో నా పాత్ర ఉన్నందుకు సంతోషంగా ఉంది’ అని కుల్దీప్ పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో కుల్దీప్ 10 వికెట్లు తీశాడు. లీగ్ దశలో ఆడని అతడు సూపర్ 8 నుంచి ఆడాడు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kuldeep Yadav
  • Kuldeep Yadav Age
  • Kuldeep Yadav Bollywood Actress
  • Kuldeep Yadav Marriage
  • Kuldeep Yadav News

తాజావార్తలు

  • Gold &Silver Rates: ఈ శుక్రవారం బంగారం, వెండి షాక్.. భారీగా పెరిగిన ధరలు

  • NBK : బాలయ్య.. నీ స్పీడ్ ఏంటయ్యా.. మరో సినిమాకు ముహూర్తం ఫిక్స్

  • Babar Azam: విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన బాబర్ ఆజామ్.. టీ20 క్రికెట్ చరిత్రలో సువర్ణ అధ్యాయం

  • Kerala Elections 2026: కేరళలో భారీగా పోలింగ్ నమోదు.. ఇది దేనికి సంకేతం..!

  • Chain Snatching: చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న రిటైర్డ్ ఆర్మీ అధికారి.. అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions