NTV Telugu Site icon

Kuldeep Yadav Marriage: బాలీవుడ్ నటితో పెళ్లి.. కుల్దీప్ యాదవ్‌ ఏమన్నాడంటే?

Kuldeep Yadav Marriage

Kuldeep Yadav Marriage

Kuldeep Yadav Rect on Marriage with Bollywood Actress: టీ20 ప్రపంచకప్ 2024 విజయోత్సవ సంబరాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీ, ముంబైలలో వేడుకల అనంతరం భారత జట్టు ఆటగాళ్లకు వారి వారి సొంత నగరాల్లో అభిమానులు ఘనమైన స్వాగతం పలుకుతున్నారు. భారత్‌ను చాంపియన్‌గా నిలబెట్టడంలో కీలకపాత్ర పోషించిన మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు సొంతగడ్డ కాన్పూర్‌లో ఘనస్వాగతం లభించింది. అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చి.. టపాసులు, డోలు చప్పుళ్ల మధ్య ఊరేగిస్తూ తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కుల్దీప్ తన వ్యక్తిగత జీవితం గురించి కీలక విషయం తెలిపాడు.

తాను త్వరలో వివాహం చేసుకోబోతున్నానంటూ అభిమానులకు కుల్దీప్ యాదవ్‌ తీపి కబురు చెప్పాడు. అయితే బాలీవుడ్ నటిని వివాహం చేసుకోబోతున్నానంటూ వచ్చిన వార్తలను కుల్దీప్ కొట్టిపారేశాడు. కుల్దీప్ ఓ జాతీయ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ.. తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి సినిమా రంగానికి చెందిన వ్యక్తి కాదని స్పష్టం చేశాడు. తనను, తన కుటుంబాన్ని బాగా చూసుకునే అమ్మాయి జీవితంలోకి రావడం చాలా ముఖ్యమని అతడు అభిప్రాయపడ్డాడు. దీనిపై త్వరలోనే అందరికీ శుభవార్త చెబుతానని 29 ఏళ్ల కుల్దీప్ చెప్పుకొచ్చాడు.

Also Read: Maharaja OTT: విజయ్ సేతుపతి ‘మహారాజా’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

టీ20 ప్రపంచకప్ గెలవడంపై కుల్దీప్ యాదవ్‌ సంతోషం వ్యక్తం చేశాడు. ‘ఈ క్షణాల కోసం నేను చాలా కాలం నుంచి వేచి చూస్తున్నా. వ్యక్తిగతం కంటే కూడా జట్టుగా ఈ కప్‌ భారత్‌కు చాలా అవసరం. ప్రధాని నరేంద్ర మోడీని కలవడం చాలా ఉత్సాహం నింపింది. ఈ రోజులను నేను ఎప్పటికీ మర్చిపోను. భారత్ విజయంలో నా పాత్ర ఉన్నందుకు సంతోషంగా ఉంది’ అని కుల్దీప్ పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో కుల్దీప్ 10 వికెట్లు తీశాడు. లీగ్ దశలో ఆడని అతడు సూపర్ 8 నుంచి ఆడాడు.

 

Show comments