NTV Telugu Site icon

Minister KTR: కరెంట్ లేదంటున్నారు.. రేవంత్ రెడ్డి, ప్రేమ్ సాగర్ వైర్లు పట్టుకోండి..

Minister Ktr

Minister Ktr

Minister KTR: కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇస్తుంటే లేదు అంటున్నారు.. రేవంత్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు విద్యుత్ వైర్లు పట్టుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. మంచిర్యాల జిల్లా ఎన్నికల ప్రచారంలో భాగంగా.. రేవంత్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు విద్యుత్ వైర్లు పట్టుకోవాలని తెలిపారు. ప్రతీ రాత్రి అనాడు జాగరమే అన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతులకు జాగారమే అని కీలక వ్యాఖ్యలు చేశారు. కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా ఆలోచించండి అని తెలిపారు. రైతు బంధు ఎవ్వరైనా ఆలోచన చేశారా? అని ప్రశ్నించారు. రైతు గుండె దైర్యంతో, రైతు బంధు వస్తుంది అనే ధీమాతో రైతులు ఉన్నారని అన్నారు. మంచిర్యాలకు మెడికల్ కాలేజీ తెచ్చింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. ఐటి హబ్ కావాలా …పేకాట క్లబ్ కావాలా… అని ప్రశ్నించారు. స్కీంలు కావాలంటే కారుకు స్కాంలు కావాలంటే కాంగ్రెస్ కి వేయండని తెలిపారు. రాబందుల చేతుల్లో పడి చావండని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. రేవంత్ ది వ్యవసాయం చేసిన మొఖమేనా? అని ప్రశ్నించారు. గజ్వేల్ లో కాంగ్రెస్ అభ్యర్థి పత్తా లేడని వ్యంగాస్త్రం వేశారు. సిద్దిపేటలో నాకు లక్ష మెజారిటీ ఇచ్చారని అన్నారు. గజ్వేల్ లో పెద్ద సారు కేసీఆర్ కి నాకంటే ఎక్కువ మెజారిటీ ఇవ్వాలన్నారు. బూతులు మాట్లాడే నాయకులకు పోలింగ్ బూత్ లో మీ ఓట్లతో సమాధానాలు ఇవ్వండి అని మంత్రి అన్నారు. పెద్ద మనిషిని పట్టుకుని ఒకటే బూతులు తిడుతున్నారని అన్నారు. కటిక వేస్తే వచ్చే కరెంట్ కావాలా..? కటిక చీకట్ల కాంగ్రెస్ కరెంట్ కావాలా..?అని ప్రశ్నించారు. కర్ణాటక లో కాంగ్రెస్ వచ్చాక మూడు గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు. రేవంత్ రెడ్డి 10HP మోటర్ కొనాలి అంటున్నారని తెలిపారు. రేవంత్ ది వ్యవసాయం చేసిన మొఖమేనా? అని ప్రశ్నించారు. పొరపాటున కాంగ్రెస్ కి ఓటేస్తే మూడు గంటల కరెంట్ వస్తుందని అన్నారు.
CM YS Jagan: అన్ని వర్గాలను మోసం చేశారు.. చంద్రబాబుపై ధ్వజమెత్తిన సీఎం జగన్‌