Site icon NTV Telugu

KTR: “ఇది ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి”.. స్పీకర్ తీర్పుపై కేటీఆర్ ఫైర్

Ktr

Ktr

KTR: ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన తీర్పు వెలువరించారు. రెండు పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపై తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెడిడెంట్ ఫైర్ అయ్యారు. ఇది ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి అని కేటీఆర్ ఓ ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లీన్ చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడమేనని వెల్లడించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజని పేర్కొన్నారు.. ఇది కేవలం ఒక తీర్పు కాదు.. అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించే ఉదాహరణ. ప్రజల ఓట్లతో గెలిచిన పదవులను వ్యక్తిగత లాభాల కోసం మార్చుకుంటే, స్పీకర్ దానికి ముద్ర వేస్తే.. ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ నిలుస్తాయి? ఇలాంటి నిర్ణయాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. సరైన సమయంలో సమాధానం చెబుతారని కేటీఆర్ స్పష్టం చేశారు.

READ MORE: TG NEWS: కడియం శ్రీహరి.. దానం నాగేందర్‌కు బిగ్ రిలీఫ్.. అనర్హత పిటిషన్లపై స్పీకర్ సంచలన తీర్పు..

అయితే.. ఈ అంశంపై తాజాగా దానం నాగేందర్ సైతం స్పందించారు. బీజేపీ, బీఆర్ఎస్, కేటీఆర్ లపై దానం నాగేందర్ ఫైర్ అయ్యారు. “నిన్న జరిగిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి ఎందుకు పిలవలేదు..? ముఖ్యమంత్రి కాలేదని కేసీఆర్‌కి ఇబ్బంది లేదు? ముఖ్యమంత్రి పదవి పోయిందని కేటీఆర్ కి చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను ఓడిపోవడానికి కారణం బీజేపీ, బీఆర్ఎస్ అపవిత్ర కలయిక. నేను ఎంపీగా గెలిచి ఉంటే ఈ పంచాయతీ లేకపోయేది. పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేశాను. నేను ఎక్కడా సభ్యత్వం తీసుకోలేదు. శాసనసభలో ఎక్కడా విప్ జారీ కాలేదు. పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడ పని చేయలేదు. నేను యుద్ధంరంగం నుండి వచ్చిన వాడ్ని. నాకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినా ఉప ఎన్నికలకు వెళ్ళి గెలిచే వాడ్ని. నేను ఖైరతాబాద్ ప్రజల సైనికుడిని. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనం కోసం ముఖ్యమంత్రిపై బురద చల్లుతున్నారు. ముఖ్యమంత్రి పదవి తమ ఆస్తి అని కొందరు అనుకుంటున్నారు. రేవంత్ ముఖ్యమంత్రి కావడం ఏంటని కొందరు మదనపడుతున్నారు. ఎంత డీ మోరల్ చేసిన సీఎం డీ మోరల్ కాలేదు. ముఖ్యమంత్రి ఆశించినట్టే గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఉంటాయి.” అని వ్యాఖ్యానించారు.

READ MORE: Jasprit Bumrah Records: ‘వన్స్ ఇన్ ఏ జనరేషన్ బౌలర్’.. మరీ ఇన్ని అరుదైన రికార్డులా బుమ్రా?

Exit mobile version