Site icon NTV Telugu

భారత్‌లో తొలిసారి KTM Adventure Rally.. గోవాలో ఆఫ్‌రోడ్ మజా

Ktm

Ktm

KTM Adventure Rally: భారతదేశంలో చాలా మంది రైడర్లకు రేసింగ్‌, అడ్వెంచర్ రైడింగ్‌ అనేవి ఇప్పటికీ విదేశాల్లో మాత్రమే జరిగేవి అని భావిస్తుంటారు. టీవీల్లో రేసులు చూడటం, సోషల్ మీడియాలో అంతర్జాతీయ స్థాయి అడ్వెంచర్ రైడర్లను ఫాలో అవ్వడమే తప్ప, స్వయంగా అలాంటి అనుభవాన్ని పొందే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే, ఈ పరిస్థితిని మార్చేందుకు KTM ముందడుగు వేసింది. ఇండియా బైక్ వీక్ 2025 వేదికగా KTM రెండు కీలక కార్యక్రమాలను అనౌన్స్‌మెంట్స్ చేసింది. అవే KTM కప్ సీజన్ 3, భారత్‌లో తొలిసారిగా నిర్వహించనున్న KTM అడ్వెంచర్ ర్యాలీ.. ఈ కార్యక్రమాలు రైడర్లను కేవలం వీక్షకులుగా కాకుండా, ప్రత్యక్షంగా నేర్చుకోవడంతో పాటు రైడ్ చేసే అవకాశాలను కల్పించబోతుంది.

Read Also: Mowgli : ప్రాఫిట్ జోన్లోకి పీపుల్ మీడియా ‘మోగ్లీ’

అయితే, KTM కప్ సీజన్ 3 జనవరి 17వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ సీజన్ ప్రత్యేకత ఏమిటంటే.. మోటోజీపీ లెజెండ్ డానీ పెడ్రోసా ఇందులో పాల్గొంటున్నారు. KTM మోటోజీపీ బైక్ అభివృద్ధిలో పెడ్రోసా కీలక పాత్ర పోషించాడు. ఇలాంటి ప్రపంచ స్థాయి రేసర్ వద్ద అనేక మంది భారతీయ రైడర్లు నేరుగా శిక్షణ పొందే అవకాశం ఈ సీజన్ ద్వారా లభించనుంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, గువాహటి నగరాల్లో జోనల్ రేసులు నిర్వహించగా, సుమారు 800 మంది రైడర్లు పాల్గొంటారు. వీరిలో నుంచి 80 మంది చెన్నైలో జరిగే ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధిస్తారు. ఎంపిక దశల్లో KTM స్టంట్ రైడర్ రోక్ బగరోస్ ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. విజేతలకు ఆస్ట్రియా గ్రాండ్ ప్రీకి ప్రయాణం, పిట్ యాక్సెస్, KTM మోటోహాల్ సందర్శన లాంటి అరుదైన అవకాశాలు లభించనున్నాయి. దేశవ్యాప్తంగా రైడర్లకు సమాన అవకాశాలు కల్పించడమే ఈ కప్ ప్రధాన లక్ష్యం.

Read Also: Off The Record: BRSకు ఇప్పుడు మరో విడత జంపింగ్స్ భయం పట్టుకుందా? | సన్మానాల పేరుతో బుజ్జగింపు..

ఇక, ఇదే సమయంలో అడ్వెంచర్ రైడర్లకు మరో గొప్ప వార్తగా KTM అడ్వెంచర్ ర్యాలీని భారత్‌లో తొలిసారిగా నిర్వహించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 3 వరకు గోవా పశ్చిమ తీర ప్రాంతంలో ఐదు రోజుల పాటు ఈ ర్యాలీ జరగనుంది. 120 మందికి పైగా రైడర్లు ఇందులో పాల్గొని గైడెడ్ అడ్వెంచర్ రైడింగ్ అనుభవాన్ని పొందనున్నారు. ఈ ర్యాలీకి ప్రపంచ ప్రఖ్యాత ఆఫ్-రోడ్ రైడర్ క్రిస్ బిర్చ్ నేతృత్వం వహించనున్నారు. డాకార్ ర్యాలీ అనుభవం, అనేక ఎండ్యూరో ఛాంపియన్‌షిప్ పతకాలు సాధించిన క్రిస్ బిర్చ్‌తో కలిసి రైడ్ చేయడం భారతీయ రైడర్లకు ఒక అరుదైన అనుభవంగా మారనుంది.

Read Also: Bhartha Mahashayulaku Vignapthi: స్టేజ్‌పై డ్యాన్స్‌తో దుమ్మురేపిన హీరోయిన్స్.. వీడియో చూశారా!

కాగా, ఇండియా బైక్ వీక్‌లో KTM ప్రత్యేకంగా ఆఫ్-రోడ్ ట్రాక్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఇందులో రైడర్లు KTM అడ్వెంచర్, ఎండ్యూరో బైక్‌లను ట్రై చేయడంతో పాటు ‘రైడ్ అండ్ విన్’ ఛాలెంజ్‌లో పాల్గొని అడ్వెంచర్ ర్యాలీకి నేరుగా ప్రవేశం పొందే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. ఈ కార్యక్రమాలపై KTM ఇండియా ప్రొబైకింగ్ ప్రెసిడెంట్ మాణిక్ నాంగియా మాట్లాడుతూ.. డానీ పెడ్రోసా, క్రిస్ బిర్చ్ లాంటి ప్రపంచ స్థాయి రైడర్లతో శిక్షణ, రైడింగ్ అవకాశాలు కల్పించడం ద్వారా భారత్‌లో రైడింగ్ కల్చర్‌ను తీసుకు రావడమే KTM ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ రెండు కార్యక్రమాల ద్వారా KTM భారతీయ రైడర్ల కలలు తీర్చులా ముందుకు సాగుతుందన్నారు.

Exit mobile version