Site icon NTV Telugu

RTC Driver: ఆర్టీసీ డ్రైవర్ సాహసం..నదిలో కొట్టుకుపోతున్న సిస్టర్స్‌ను కాపాడాడు

Driver Thumb

Driver Thumb

ఓ ఆర్టీసీ డ్రైవర్ చేసిన సాహసం ఇద్దరు అక్కాచెల్లెళ్ల జీవితాలకు పునర్జన్మనిచ్చింది. ఇద్దరు అక్కాచెల్లెళ్లు నదిలో పడి కొట్టుకుపోతున్న సమయంలో ఓ బస్సు డ్రైవర్ చూసి కాపాడారు. అనంతరం ఇద్దరినీ స్థానిక ఆసుపత్రికి తరలించారు. మానవత్వంతో డ్రైవర్ బస్సును ఆపి మరీ.. నదిలో దూకి కాపాడిన తీరును చూసి అందరూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

డ్రైవర్ మంజునాథ్

అసలేం జరిగిందంటే.. హందికుంటె అగ్రహార నదిలో బట్టలు ఉతికేందుకు ఇద్దరు అక్కాచెల్లెళ్లు వెళ్లారు. అనుకోకుండా ఆ బాలికలు ఇద్దరూ కాలుజారి నీటిలో పడిపోయారు. సరిగ్గా అదే సమయానికి నాగేనహళ్లి నుంచి శిరా మార్గంలో వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు డ్రైవర్ మంజునాథ్ ఈ ఘటనను చూశారు. ఆయన వెంటనే బస్సును పక్కకు ఆపి.. ఆలస్యం చేయకుండా నదిలోకి దూకి ఆ ఇద్దరు బాలికలను కాపాడారు. అనంతరం వారిద్దరినీ బరగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స నిమిత్తం తరలించారు. మంజునాథ్ బాలికలను కాపాడిన తీరును చూసి అందరూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. డ్రైవర్ చేసిన మంచి పనికి కేఎస్​ఆర్​టీసీ సీనియర్ అధికారులు కూడా మెచ్చుకున్నారు.

Exit mobile version