టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేస్ భరత్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. మన తెలుగు ప్లేయర్ కావడంతో ఆ మధ్య ఒక్కసారిగా అతడి పేరు మార్మోగింది. జట్టులోకి ఎంత తొందరగా వచ్చాడో.. అంతే తొందరగా అలాగే వెళ్ళిపోయాడు. టెస్టుల్లో ఛాన్స్ వచ్చినా అతడు విఫలం అవ్వడంతో.. మళ్ళీ భారత జట్టు నుంచి ఆహ్వానం అందలేదు. ఇలా టీమిండియా గెంటేసినా.. ఇప్పుడు రంజీ ట్రోఫీలో సెంచరీతో కదం తోక్కాడు.
Also Read: Bandlaguda Shocker: బండ్లగూడలో దారుణం.. ఇళ్లు ఖాళీ చేయమన్నందుకు యజమానురాలిపైనే దాడి!
ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఆడుతున్న కేస్ భరత్ 2025 రంజీ ట్రోఫీ మొదటి మ్యాచులోనే సెంచరీతో మెరిశాడు. ఉత్తరప్రదేశ్‌తో కాన్పూర్‌లోని గ్రీన్‌పార్క్‌లో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భరత్ తన ఫామ్‌ను నిరూపించుకున్నాడు. ఈ మ్యాచులో ఓపెనర్‌గా వచ్చిన భరత్ మొత్తం 244 బంతులను ఎదుర్కొని 13 బౌండరీలతో సెంచరీని పూర్తి చేసాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర జట్టు 3 వికెట్ల నష్టానికి 289 పరుగులు సాధించింది. ఇదిలా ఉండగా, భారత టెస్ట్ జట్టులో చోటు కోల్పోయి, ఐపీఎల్ వేలంలో కూడా అమ్ముడుపోని భరత్.. తన ఆటపై దృష్టి సారించి దేశవాళీ క్రికెట్‌లో చెలరేగి ఆడుతున్నాడు. ఇదే ఫామ్ కొనసాగిస్తే మరోసారి టీమిండియా తలుపులు తట్టే అవకాశాలు లేకపోలేదు.
