NTV Telugu Site icon

Krithi Shetty : బంపర్ ఆఫర్ కొట్టేసిన కృతిశెట్టి.. అమ్మడు దశ తిరిగినట్లే ?

New Project 2024 10 19t112408.398

New Project 2024 10 19t112408.398

Krithi Shetty : టాలీవుడ్‌లో ఒక్కసారిగా ఉప్పెనలా ఎగిసిన పడింది యంగ్ బ్యూటీ కృతి శెట్టి. అదే జోష్‌లో హ్యాట్రిక్ హిట్ కొట్టి కుర్రాళ్ల హాట్ కేక్‌గా మారిపోయింది. కానీ అంతలోనే హ్యాట్రిక్ ఫ్లాప్ చూడాల్సి వచ్చింది. దీని ఫలితంగా గోల్డేన్ లెగ్ అనుకున్న కృతి కాస్త ఐరెన్‌ లెగ్‌గా మారిపోయింది. తెలుగులో అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో తమిళ్ వైపు అడుగులు వేసింది అమ్మడు. అక్కడ ఏకంగా బాలా-సూర్య సినిమాలో ఛాన్స్ అందుకుంది. కానీ ఈ సినిమా నుంచి సూర్యతో పాటు కృతి కూడా మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం తమిళ్‌లో రెండు మూడు సినిమాలు చేస్తోంది కృతి. తెలుగులో మాత్రం ఒక్క సినిమా కూడా లేదు. చివరగా ‘శర్వానంద్’ మనమే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కృతికి.. ఈ సినిమా కొత్త అవకాశాలు ఏమి తెచ్చిపెట్టలేదు. దీంతో.. ఇక తెలుగులో ఆఫర్లు కష్టమే అనుకున్నారు. కానీ ఇప్పుడు ఒక సూపర్ ఛాన్స్ కొట్టేసినట్టుగా తెలుస్తోంది.

Read Also:Naga Chaitanya : తండేల్ డిసెంబర్ లో రాదు.. కారణం ఇదే..

ఇప్పుడున్న టాలీవుడ్ యంగ్ హీరోల్లో విశ్వన్ ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాడు. ప్రజెంట్ మెకానిక్ రాకీ, లైలా అనే సినిమాలు చేస్తున్నాడు మాస్ కా దాస్. నెక్స్ట్ జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్‌తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడు. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. లేటెస్ట్‌గా ఈ సినిమాలో.. హీరోయిన్‌గా కృతిశెట్టిని ఫైనల్ చేసినట్లుగా తెలిసింది. త్వరలో మేకర్స్‌ నుంచి అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఏదేమైనా.. తెలుగులో ఒక మంచి ఆఫర్ కోసం వెయిట్ చేస్తున్న కృతికి.. ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.

Read Also:Gold Rate Today: మగువలకు బ్యాడ్‌న్యూస్.. వరుసగా నాలుగోరోజు పెరిగిన బంగారం ధరలు!

Show comments