Site icon NTV Telugu

Kriti Shetty :నడుమును బొంగరంలా తిప్పుతూ బెల్లీ డ్యాన్స్ చేసిన బేబమ్మ..

Whatsapp Image 2024 02 09 At 11.14.18 Pm

Whatsapp Image 2024 02 09 At 11.14.18 Pm

టాలీవుడ్ క్యూట్ బ్యూటీ కృతి శెట్టి ‘ఉప్పెన’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ సినిమా లో తనదైన పెర్పామెన్స్ తో ఎంతగానో ఆకట్టుకుంది.అందం, అభినయంతో ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఉప్పెన సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కృతి శెట్టి ఆ తరువాత బంగార్రాజు, శ్యాంసింగరాయ్ వంటి చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ అందుకుంది. కానీ ఆ తర్వాత వచ్చిన వారియర్, మాచర్ల నియోజకవర్గం, కస్టడీ వంటి సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి.దీంతో టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఇక్కడ తగ్గింది. ఫలితంగా సినిమా ఆఫర్లు కూడా తగ్గుతూ వచ్చాయి. వెంటనే బేబమ్మ ఫోకస్ కోలీవుడ్ పైకి మళ్లీంది. తనకు కూడా అక్కడ మంచి ఆఫర్స్ వస్తున్నాయి.

ప్రస్తుతం తమిళం లో వా వాతియారే , జీని తో పాటు ప్రదీప్ రంగనాథన్ సరసన ‘లవ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్’ వంటి సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అలాగే తెలుగులో ‘శర్వా35’, మలయాళంలో కూడా ఒక సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది.అయితే సినిమాలతో ఎంత బిజీ గా వున్నా కృతి శెట్టి సోషల్ మీడియా లో యాక్టివ్ గానే కనిపిస్తోంది. వరుసగా పోస్టులు పెడుతూ ఫ్యాన్స్ ను అలరిస్తుంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ బెల్లీ డాన్స్ తో మతులు పోగొట్టింది. ఫస్ట్ టైమ్ నడుమును బొంగరంలా తిప్పుతూ ఆకట్టుకుంటుంది. ‘బీస్ట్’లోని అరబిక్ కుతు సాంగ్ కు ఈ భామ బెల్లీ డాన్స్ చేసింది.అలాగే నడుము అందం, నాభీ సొగసును చూపిస్తూ ఎంతో మెస్మరైజ్ చేసింది. మరింత నాజుగ్గా తయారైన కృతి శెట్టి తన అందం తో కట్టిపడేసింది.. ఏదేమైనా తను పంచుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

Exit mobile version