Site icon NTV Telugu

Krithi Shetty : కిల్లింగ్ లుక్స్ తో మతి పోగొడుతున్న కృతి శెట్టి..

Whatsapp Image 2023 07 29 At 10.45.52 Am

Whatsapp Image 2023 07 29 At 10.45.52 Am

క్యూట్ హీరోయిన్ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఉప్పెన’ సినిమాతో కృతిశెట్టి టాలీవుడ్ కు పరిచయం అయింది.. ఉప్పెన సినిమాతో ఈ ముద్దుగుమ్మ మంచి గుర్తింపు సంపాదించుకుంది.తన క్యూట్ లుక్స్ కీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు.అలాగే తన అద్భుతమైన నటనతో ఎంతగానో మెప్పించింది. ఆ సినిమా అద్భుత విజయం సాధించడంతో తెలుగులో వరుసగా ఆఫర్స్ అందుకుంది.ఈ భామ నాగచైతన్య సరసన ‘బంగార్రాజు’ సినిమాలో హీరోయిన్ గా నటించింది.అలాగే నేచరల్ స్టార్ నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’లో కూడా ఈ భామ హీరోయిన్ గా నటించింది.ఈ రెండు చిత్రాలు మంచి విజయం సాధించాయి.దీంతో కెరీర్ ప్రారంభంలోనే హ్యాట్రిక్ హిట్స్ ను సొంతం చేసుకున్న హీరోయిన్ గా రికార్డు క్రియేట్ చేసుకుంది. దీనితో ఈ భామకు వరుసగా ఆఫర్లు వచ్చాయి.కానీ ఆ తర్వాత ఈ భామ నటించిన ‘ది వారియర్’. ‘మాచెర్ల నియోజకవర్గం’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ వంటి చిత్రాలు డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో కృతిశెట్టి కాస్త నిరాశ చెందింది..

ఇక రీసెంట్ గా నాగ చైతన్యతో కలిసి నటించిన ‘కస్టడీ’ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ భామకు టాలీవుడ్ లో ఆఫర్లు అంతగా రావడం లేదు.ప్రస్తుతం తమిళం మరియు మలయాళంలో సినిమాలు చేస్తుంది. మలయాళంలో టోవినో థామస్ చిత్రంతో పాటు, తమిళంలో జయం రవి సరసన ‘జీనీ’ సినిమాల్లో ఈ భామ నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉన్నాయి. ఆ రెండు సినిమాలు హిట్ అయితే కృతి శెట్టికీ మళ్ళీ వరుస ఆఫర్స్ వస్తాయి.ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో కూడా కృతి శెట్టి తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను బాగా పెంచుకుంటోంది.వరుసగా ఫొటోషూట్లు చేస్తూ తన గ్లామర్ ఫొటోలను అభిమానులకు షేర్ చేస్తుంది.తన బ్యూటీఫుల్ లుక్ తో ఎంతగానో అలరిస్తుంది.తాజాగా ఈ భామ తన బ్యూటీఫుల్ ఫొటోలను షేర్ చేసింది. వైట్ టాప్ ధరించి కిల్లింగ్ చూపులతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది.. ఈ ఫోటోలకు ఫ్యాన్స్ లైక్స్, కామెంట్స్ చేస్తూ నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు

Exit mobile version