Site icon NTV Telugu

Krishna Vrinda Vihari : విశాఖ బీచ్‌లో సందడి చేసిన కృష్ణ వ్రింద విహారి చిత్ర బృందం

Kirshna Vrinda Vihari

Kirshna Vrinda Vihari

శంకర్‌ ప్రసాద్‌ మూల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఉషా మూల్పూరి నిర్మించిన నాగ శౌర్య హీరోగా శిర్లే షెటియా హీరోయిన్లగా అనీష్  కృష్ణ దర్శకత్వంలో కృష్ణ వ్రింద విహారి  చిత్రాన్ని ఈనెల సెప్టెంబర్ 23న విడుదల చేయన్నున్నారు. దానిలో భాగంగా విశాఖ  ఆర్కే బీచ్ రోడ్ కాళీమాత నుండి వైఎంసియే వరకు కాలినడకన అభిమానుల మధ్య వినూత్నంగా చిత్ర ప్రమోషన్ ను నిర్వహించారు. ఓ వైపు జోరుగా వాన కురుస్తున్న లెక్కచేయకుండా అభిమానుల మధ్య కోలాహలంగా కేరింతలతో ప్రమోషన్ ముందుకు సాగింది. ఈ సందర్భంగా నాగశౌర్య మాట్లాడుతూ.. విభిన్న కథతో ఈ చిత్రాన్ని రూపొందించామని చెప్పారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కించామన్నారు. ఈ చిత్రం ప్రేక్షకుల మదిని తాకుతుందని అభిప్రాయపడ్డారు.

 

ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా ఈ చిత్రం ఉంటుందని చెప్పారు. ఈ ప్రమోషన్లు భాగంగా కాకినాడ లో పూర్తి చేసుకొని విశాఖకు విచ్చేశామని అన్నారు. విశాఖ అంటే తనకు ఎంతో ఇష్టమని ప్రమోషన్ లో భాగంగా విశాఖ రావడం తన అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా థియేటర్ కు విచ్చేసి వీక్షించి గొప్ప విజయం అందించాలని కోరారు. వర్షం సైతం లెక్కచేయకుండా తనతో పాటు విశాఖ ప్రజలు కాలి నడకలో పాల్గొనడం ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చింది అని అభిప్రాయం వ్యక్తం చేశారు

 

 

Exit mobile version