Site icon NTV Telugu

KP Nagarjuna Reddy: జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న కేపీ నాగార్జున రెడ్డి

Kp

Kp

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో శాసన సభ్యులు కుందురు నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగనన్న సురక్ష పథకంలో పాల్గొన్న ప్రజలకు పరీక్షలు చేసిన డాక్టర్లు మందులు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో కేపీ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ.. జగనన్న సురక్ష పథకం ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. మీ ఆరోగ్యం కాపాడుకునే బాధ్యత మీదేనని ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి వెల్లడించారు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మందులు కూడా ఫ్రీగా ఇస్తారని ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి అన్నారు.

Read Also: Walking Mistakes: వాకింగ్ చేస్తున్నప్పుడు ఈ తప్పులు చేయద్దు..!

జగనన్న సురక్ష కార్యక్రమం అనేది పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టాడని మార్కపూరం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి సూచించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం, గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నటు వంటి పేద ప్రజలకు ఒక గొప్ప వరమని ఆయన తెలియజేశారు. అయితే, తాజాగా ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి మార్కాపురం మండలంలోని రాయవరం దగ్గర నిర్మిస్తున్న మెడికల్ కాలేజ్ పనులను పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన పరిశీలించారు. సిబ్బందితో సమావేశమై పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా భవన నిర్మాణ పనులు పూర్తయ్యేలా కృషి చేయాలని సిబ్బందికి ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి సూచించారు.

Exit mobile version