హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా భక్తి టీవీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతున్న ‘కోటి దీపోత్సవం 2026’ ఐదో రోజుకు చేరుకుంది. కార్తీక శుద్ధ నవమి సందర్భంగా నవంబర్ 18, బుధవారం నాడు నిర్వహిస్తోన్న ప్రత్యేక ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి.
నేటి వేడుకల్లో భాగంగా శ్రీ పరిపూర్ణానందగిరి స్వామీజీ, శ్రీ అసంగానందగిరి స్వామీజీ (వేర్పేడు శ్రీవ్యాసాశ్రమం) భక్తులకు అనుగ్రహ భాషణం అందించనున్నారు. అలాగే ప్రముఖ విద్వాంసులు ఆచార్య శ్రీ కాకునూరి సూర్యనారాయణ మూర్తి ప్రవచనామృతం ఉండనుంది. ఇక ప్రధాన పూజా కార్యక్రమాలలో భాగంగా.. వేదికపై రెజిమెంటల్ మహోగణపతికి కోటిగరికార్చన, భక్తులచే గణపతి విగ్రహాలకు కోటిగరికార్చన నిర్వహించనున్నారు. ఇవాళ్టి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న ‘కాజీపేట శ్రీ శ్వేతార్క గణపతి కల్యాణం’ అత్యంత కనులపండువగా సాగనుంది. అలాగే భక్తుల కోసం మూషిక వాహన సేవను కూడా ఏర్పాటు చేశారు.
ఈ దివ్య ఘట్టాలను స్వయంగా వీక్షించేందుకు, నేటి కార్యక్రమాలకు సంబంధించిన లైవ్ వీడియో లింక్ కింద ఉంది, తప్పకుండా వీక్షించండి!

