Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు

  • పీఠాధిపతుల అనుగ్రహ భాషణం
  • అమ్మవార్లకు కోటి కుంకుమార్చన
  • మైసూరు చాముండేశ్వరీదేవి వైభవం
  • భద్రకాళీశ్వరుల కల్యాణోత్సవం
Koti Deepotsvam Day 4

Koti Deepotsvam Day 4

కార్తీక మాస శోభతో, శివ నామస్మరణతో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఎన్టీవీ, భక్తి టీవీ, వనితా టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం – 2026’ కన్నులపండువగా కొనసాగుతోంది. ఇప్పటికే మూడు రోజులు దిగ్విజయంగా సాగిన ఈ మహోత్సవంలో భాగంగా, నేడు కార్తీక మంగళవారం – గోపాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని నాలుగో రోజు విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగనున్నాయి. నేటి వేడుకల్లో శ్రీ ఆదిచుంచనగిరి మఠం పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ డా. నిర్మలానందనాథ మహాస్వామీజీ, కుక్కే సుబ్రహ్మణ్య మఠం పీఠాధిపతులు శ్రీ విద్యా ప్రసన్న తీర్థ స్వామీజీల అనుగ్రహ భాషణం, డా. ఎస్. అనంతలక్ష్మి గారి ప్రవచనామృతం భక్తులను అలరించనున్నాయి. వేదికపై ప్రసిద్ధ క్షేత్రాల అమ్మవార్లకు కోటి కుంకుమార్చన, మైసూరు చాముండేశ్వరీదేవి వైభవంతో పాటు భక్తులచే దుర్గా విగ్రహాలకు కోటి కుంకుమార్చన నిర్వహించనుండగా, నేటి ప్రధాన ఘట్టంగా వరంగల్ శ్రీ భద్రకాళీశ్వరుల కల్యాణం , సింహ వాహన సేవ అత్యంత వైభవంగా సాగనున్నాయి; ఈ రోజు జరగబోయే దివ్య కార్యక్రమాలను ఈ క్రింది లింక్‌లో ప్రత్యక్షంగా వీక్షించండి.