హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం–2026 వేడుకలు పవిత్ర కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం పదకొండో రోజున అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ విశేష వేడుకల్లో అవధూత దత్తపీఠం పీఠాధిపతి పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అనుగ్రహ భాషణం, బ్రహ్మశ్రీ డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి ప్రవచనామృతంతో పాటు తిరువణ్ణామలై అరుణాచలేశ్వరునికి బిల్వార్చన సహిత మహానీరాజనం, భక్తులచే శివలింగాలకు బిల్వార్చన, శ్రీ అపీతకుచాంబికా అరుణాచలేశ్వర స్వామివారి కల్యాణ మహోత్సవం, పల్లకి వాహన సేవ, సప్తహారతులు, స్వర్ణలింగోద్భవం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కార్తీక పౌర్ణమి వేళ భక్తులందరూ ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్‌టీపీఎల్) సాదరంగా ఆహ్వానిస్తుండగా, దీపారాధనకు అవసరమైన పూజా సామాగ్రిని ఉచితంగా అందజేస్తున్నారు; ఈ రోజు కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారం ఈ క్రింది లింక్ లో చూడండి.
Koti Deepotsavam 2026 Day-11 Live : పదకొండో రోజు.. కార్తీక పౌర్ణమి వేళ అరుణాచలేశ్వర స్వామి కల్యాణం
- కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి వేడుకలు
- అరుణాచలేశ్వర స్వామి దివ్య కల్యాణం
- గణపతి సచ్చిదానంద స్వామీజీ అనుగ్రహ భాషణం
- భక్తులచే శివలింగాలకు బిల్వార్చన

Day11
