భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఆధ్యాత్మిక ఛానెల్ ‘భక్తి టీవీ’ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ‘కోటి దీపోత్సవం’ 2025 దిగ్విజయంగా కొనసాగుతోంది. నవంబర్ 1న ప్రారంభమైన కోటి దీపోత్సవం.. 8 రోజుల పాటు విశేష కార్యక్రమాలతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి.. దీపాలు వెలిగిస్తున్నారు. ప్రతి రోజు ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం కైలాసాన్ని తలపిస్తోంది. కోటి దీపోత్సవంలో నేడు 9వ రోజు. నేటి విశేష కార్యక్రమాలు ఏంటో తెలుసుకుందాం.
Also Read: Jubilee Hills Bypoll: నేటితో ప్రచారానికి తెర.. సాయంత్రం నుంచి ఆంక్షలు, వైన్స్ బంద్!
కోటి దీపోత్సవం 2025లో తొమ్మిదవ రోజు విశేష కార్యక్రమాలు ఉన్నాయి. శ్రీ మధు పండిట్ దాస (బెంగళూరు ఇస్కాన్ అధ్యక్షులు, అక్షయపాత్ర ఫౌండేషన్ చైర్మన్), శ్రీ సత్య గౌర చంద్ర దాస (హైదరాబాద్ హరేకృష్ణ మూవ్మెంట్ అధ్యక్షులు) గారిచే అనుగ్రహ భాషణం ఉంటుంది. శ్రీ దివి నరసింహదీక్షితులు ప్రవచనామృతం నిర్వహిస్తారు. శ్రీనృసింహ రక్షా కంకణ పూజ, గురువాయూర్ శ్రీకృష్ణ నవనీతపూజ, నాగసాధువులచే వేదికపై మహారుద్రాభిషేకం ఉంటుంది. భక్తులు నృసింహ విగ్రహాలకు రక్షా కంకణ పూజ చేయనున్నారు. స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవంను నిర్వహిస్తారు. గరుడ వాహన సేవ కూడా ఉంటుంది.
