Koti Deepotsavam 2024 Day 8 : సకలాభీష్టాలు ప్రసాదించే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కల్యాణోత్సవం
- ఎన్టీఆర్ స్టేడియం వేదికగా భక్తి టీవీ కోటి దీపోత్సవం వేడుక
- ఎనిమిదో రోజు విశేష కార్యక్రమాలు
- వేదికపై కాజీపేట శ్వేతార్క గణపతికి సప్తవర్ణ మహాభిషేక సహిత కోటి గరికార్చన
- భక్తులచే గణపతి విగ్రహాలకు కోటి గరికార్చన
- కోటి దీపోత్సవ వేదికపై శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కల్యాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Koti Deepotsavam 2024 Day 8 : భక్తి, ఎన్టీవీ టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం’ వేడుకలు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవంబర్ 9న ఆరంభమైన ఈ దీపాల పండుగ దిగ్వజయంగా కొనసాగుతోంది. హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కోటి దీపోత్సవ వేడుకకు చేరుకున్నారు. కోటి దీపోత్సవానికి అందరూ ఆహ్వానితులే.. కార్తిక మాసం శుభవేళ కోటి దీపోత్సవంలో పాల్గొనాల్సిందిగా భక్తులను సాదరంగా ఆహ్వానిస్తోంది రచన టెలివిజన్ ప్రైవెట్ లిమిటెడ్.. ఈ ఉత్సవంలో పాల్గొనే భక్తులకు పూజా సామగ్రి కూడా భక్తి టీవీ ఉచితంగా అందజేస్తోన్న విషయం విధితమే కాగా.. హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతోందని మీకు తెలియజేస్తున్నాం.

Also Read
- Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
- Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
భక్తి టీవీ కోటి దీపోత్సవం 2024, 8వ రోజు (16-11-2024)- కార్తిక శనివారం ~ పాడ్యమి కార్యక్రమాలు
శంఖారావంతో ప్రారంభమైన ఎనిమిదవ రోజు కోటి దీపోత్సవ మహోత్సవం.. శ్రీజగన్నాధ మఠం వేదపాఠశాల, సీతారాంబాగ్, హైదరాబాద్ వారిచే వేదపఠనం జరిగింది. కార్తిక శనివారం వేళ కోటి దీపోత్సవ మహోత్సవంలో విశేషమైన ప్రదోషకాల అభిషేకం నిర్వహించారు అర్చకులు. పద్మప్రియ బృందం ఆధ్వర్యంలో భక్తి గీతాలు ఆలపించారు. కోటి దీపోత్సవంలో ఎనిమిదవ రోజు బ్రహ్మశ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారి ప్రవచనామృతం భక్తులకు పంచారు. వేదిక పైకి సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవమూర్తుల ఆగమనం.. సకల విఘ్నాలను తొలగించే కాజీపేట శ్వేతార్క గణపతికి సప్తవర్ణ మహాభిషేక సహిత కోటి గరికార్చన, సకలాభీష్టాలు ప్రసాదించే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కల్యాణోత్సవం కన్నుల పండుగగా సాగింది. కుక్కె సుబ్రహ్మణ్య మఠం పీఠాధిపతి శ్రీ విద్యాప్రసన్నతీర్థస్వామిచే “శ్రీ సుబ్రహ్మణ్య అర్చన”, ఇలకైలాసన పార్వతీపుత్రుని వైభవం.. మూషిక వాహనంపై లంబోదరుని అనుగ్రహం, కుక్కే శ్రీ సుబ్రహ్మణ్యమఠం మఠాధిపతి శ్రీ విద్యాప్రసన్న తీర్థ స్వామీజీ వారి అనుగ్రహ భాషణం భక్తులను ఆకట్టుకున్నాయి.
అయితే.. ఈ రోజు ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి సురేష్ గోపి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వేదికపైన ఉన్న దేవతామూర్తులకు పూజలు నిర్వహించి.. నేటి తొలి కార్తిక దీపాన్ని వెలిగించారు. స్వర్ణ కాంతులతో బంగారు లింగోద్భవ దర్శనంతో భక్తులు దైవానుభూతికి లోనయ్యారు. కోరిన కోర్కెలు ఫలింపజేసే సప్త హారతి దర్శనం, జన్మరాహిత్యాన్ని ప్రసాదించే కోటి దీపోత్సవ మహాలింగానికి మహా నీరాజనం భక్తులను అలరించాయి. కుక్కే శ్రీ సుబ్రహ్మణ్యమఠం మఠాధిపతి శ్రీ విద్యాప్రసన్న తీర్థ స్వామీజీ వారికి గురు వందనం, సతీష్ బృందం లెజ్యూమ్ నృత్యం, ప్రకాశ్ బృందం పేరణి నృత్యం, రాజేశ్వరి బృందం కరగాటం నృత్యం, అమ్రేశ్ బృందం పుణే డోలు విన్యాసం, వినేష్ బృందం పంబమేళా, సాంస్కృతిక కదంబం (కోలాటం), మహా మంగళ హారతితో నేటి కోటి దీపోత్సవం వేడుకలు ముగిశాయి.
ఇదిలా ఉంటే.. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9.30 వరకు ఎన్టీఆర్ స్టేడియం దీపాల కాంతులతో వెలిగిపోయింది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభంకానున్న కోటిదీపోత్సవం మహాయజ్ఞంలో పాల్గొనాల్సింది సాదరంగా ఆహ్వానం పలుకుతోంది ఎన్టీవీ, భక్తి టీవీ, వనతి టీవీ.. ఈ నెల 14వ తేదీన ప్రారంభం.. ఈ నెల 27వ తేదీతో ముగియనున్న ఈ దీపయజ్ఞంలో పాల్గొనే భక్తులకు పూజాసామగ్రి, దీపారాధన వస్తువులను రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ పూర్తిగా ఉచితంగా అందిస్తోంది..
తాజావార్తలు
-
Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
-
Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!