NTV Telugu Site icon

Koti Deepotsavam 2024 Day 8 : సకలాభీష్టాలు ప్రసాదించే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కల్యాణోత్సవం

Koti Deepotsavam 2024 Day 8 : భక్తి, ఎన్టీవీ టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం’ వేడుకలు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవంబర్‌ 9న ఆరంభమైన ఈ దీపాల పండుగ దిగ్వజయంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కోటి దీపోత్సవ వేడుకకు చేరుకున్నారు. కోటి దీపోత్సవానికి అందరూ ఆహ్వానితులే.. కార్తిక మాసం శుభవేళ కోటి దీపోత్సవంలో పాల్గొనాల్సిందిగా భక్తులను సాదరంగా ఆహ్వానిస్తోంది రచన టెలివిజన్‌ ప్రైవెట్‌ లిమిటెడ్‌.. ఈ ఉత్సవంలో పాల్గొనే భక్తులకు పూజా సామగ్రి కూడా భక్తి టీవీ ఉచితంగా అందజేస్తోన్న విషయం విధితమే కాగా.. హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతోందని మీకు తెలియజేస్తున్నాం.

 

 భక్తి టీవీ కోటి దీపోత్సవం 2024, 8వ రోజు (16-11-2024)- కార్తిక శనివారం ~ పాడ్యమి కార్యక్రమాలు

శంఖారావంతో ప్రారంభమైన ఎనిమిదవ రోజు కోటి దీపోత్సవ మహోత్సవం.. శ్రీజగన్నాధ మఠం వేదపాఠశాల, సీతారాంబాగ్, హైదరాబాద్ వారిచే వేదపఠనం జరిగింది. కార్తిక శనివారం వేళ కోటి దీపోత్సవ మహోత్సవంలో విశేషమైన ప్రదోషకాల అభిషేకం నిర్వహించారు అర్చకులు. పద్మప్రియ బృందం ఆధ్వర్యంలో భక్తి గీతాలు ఆలపించారు. కోటి దీపోత్సవంలో ఎనిమిదవ రోజు బ్రహ్మశ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారి ప్రవచనామృతం భక్తులకు పంచారు. వేదిక పైకి సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవమూర్తుల ఆగమనం.. సకల విఘ్నాలను తొలగించే కాజీపేట శ్వేతార్క గణపతికి సప్తవర్ణ మహాభిషేక సహిత కోటి గరికార్చన, సకలాభీష్టాలు ప్రసాదించే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కల్యాణోత్సవం కన్నుల పండుగగా సాగింది. కుక్కె సుబ్రహ్మణ్య మఠం పీఠాధిపతి శ్రీ విద్యాప్రసన్నతీర్థస్వామిచే “శ్రీ సుబ్రహ్మణ్య అర్చన”, ఇలకైలాసన పార్వతీపుత్రుని వైభవం.. మూషిక వాహనంపై లంబోదరుని అనుగ్రహం, కుక్కే శ్రీ సుబ్రహ్మణ్యమఠం మఠాధిపతి శ్రీ విద్యాప్రసన్న తీర్థ స్వామీజీ వారి అనుగ్రహ భాషణం భక్తులను ఆకట్టుకున్నాయి.

అయితే.. ఈ రోజు ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి సురేష్‌ గోపి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వేదికపైన ఉన్న దేవతామూర్తులకు పూజలు నిర్వహించి.. నేటి తొలి కార్తిక దీపాన్ని వెలిగించారు. స్వర్ణ కాంతులతో బంగారు లింగోద్భవ దర్శనంతో భక్తులు దైవానుభూతికి లోనయ్యారు. కోరిన కోర్కెలు ఫలింపజేసే సప్త హారతి దర్శనం, జన్మరాహిత్యాన్ని ప్రసాదించే కోటి దీపోత్సవ మహాలింగానికి మహా నీరాజనం భక్తులను అలరించాయి. కుక్కే శ్రీ సుబ్రహ్మణ్యమఠం మఠాధిపతి శ్రీ విద్యాప్రసన్న తీర్థ స్వామీజీ వారికి గురు వందనం, సతీష్ బృందం లెజ్యూమ్ నృత్యం, ప్రకాశ్ బృందం పేరణి నృత్యం, రాజేశ్వరి బృందం కరగాటం నృత్యం, అమ్రేశ్ బృందం పుణే డోలు విన్యాసం, వినేష్ బృందం పంబమేళా, సాంస్కృతిక కదంబం (కోలాటం), మహా మంగళ హారతితో నేటి కోటి దీపోత్సవం వేడుకలు ముగిశాయి.