ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ‘కోటి దీపోత్సవం’ దిగ్విజయంగా కొనసాగుతోంది. దీపాల పండగలో ఇప్పటికే రెండు రోజులు పూర్తి కాగా.. వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. నేడు కోటి దీపోత్సవంలో మూడవ రోజు. అందులోనూ కార్తిక సోమవారం కాబట్టి.. భక్తులు తండోపతండాలుగా తరలిరానున్నారు. కార్తిక సోమవారం నాడు కోటి దీపోత్సవంలో విశేష కార్యక్రమాలు ఏంటో తెలుసుకుందాం.
కోటి దీపోత్సవంలో మూడవ రోజు పరమ పూజ్య శ్రీ శ్రీ వామనాశ్రమ మహా స్వామీజీ (వైశ్య గురు మఠము హలదీపూర్ మరియు వారణాసి), శ్రీ శివానంద భారతి స్వామీజీ (కర్ణాటక హోస్పేట చింతామణి మఠం) గారిచే అనుగ్రహ భాషణం ఉండగా.. శ్రీ బంగారయ్య శర్మ గారు ప్రవచనామృతం చేయనున్నారు. వేదికపై శివపరివారానికి కోటి బిల్వార్చన, భక్తులచే శివలింగాలకు కోటి బిల్వార్చన, కోటి దీపోత్సవం వేదికపై జ్యోతిర్లింగ క్షేత్రం ఉజ్జయిని మహాకాళ్ కల్యాణం, పల్లకీ వాహన సేవ ఉంటుంది.
Also Read: AUS vs IND: భారత్‌తో తొలి టెస్ట్.. ఆస్ట్రేలియా కొత్త అస్త్రం!
సాయంత్రం 5.30 నుంచి మూడో రోజు విశేష కార్యక్రమాలు ఆరంభమవుతాయి. భక్తులు ముందుగానే ఎన్టీఆర్ స్టేడియంకు చేరుకోవచ్చు. దీపాల పండగ సందర్భంగా వేలాది మందితో ఎన్టీఆర్ స్టేడియం కళకళలాడుతోంది. నవంబర్ 9 నుంచి 25 వరకు కోటి దీపోత్సవం జరగనున్న విషయం తెలిసిందే.