NTV Telugu Site icon

Koti Deepotsavam 2023 Day 4: వైభవంగా కోటిదీపోత్సవం.. ఇలకైలాసంలో నేటి విశేష కార్యక్రమాలు ఇవే..

Koti Deepotsavam

Koti Deepotsavam

Koti Deepotsavam 2023 Day 4: భక్తి టీవీ కోటిదీపోత్సవం వైభవంగా సాగుతోంది.. ఇప్పటికే మూడు రోజుల పాటు కన్నుల పండుగా సాగిన ఈ దీపయజ్ఞంలో భక్తులు పరవశించిపోతున్నారు.. కోటి దీపోత్సవంలో 3వ రోజు ఉత్సవంలో భాగంగా అలంపురం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు.. అశేష భక్తజనం శివనామస్మరణతో.. ఇల కైలాసంగా మారిపోయిన ఎస్టీఆర్‌ స్టేడియంలో మార్మోగింది.. ఇక, నాల్గోరోజు ఇల కైలాసంలో జరగనున్న విశేష కార్యక్రమాలను విషయంలోకి వెళ్తే..

కోటి దీపోత్సవంలో నాల్గోరోజు కార్యక్రమాలు..

* నాగులచవితి శుభవేళ భక్తుల గ్రహదోషాలు హరించేలా శ్రీకాళహస్తి ఆలయ అర్చకులచే రాహుకేతు పూజ

* అనంతపుణ్యప్రదం శ్రీకాళహస్తీశుని కల్యాణోత్సవం

* సింహ, గజ వాహనాలపై పార్వతీపరమేశ్వరుల దర్శనం

* సకలసౌభాగ్యాలను ప్రసాదించే కొల్హాపూర్‌ మహాలక్ష్మీ దివ్యదర్శనం

* కంచి కామాక్షి అమ్మవారి అనుగ్రహం

* కుక్కే శ్రీసుబ్రహ్మణ్య మఠం శ్రీవిద్యాప్రసన్న తీర్థస్వామి అనుగ్రహభాషణం

* శ్రీ మల్లాది వేంకట రామనాథశాస్త్రి ప్రవచనామృతం

* కోటిదీపాల వెలుగులు

* సప్తహారతుల కాంతులు

* స్వర్ణ లింగోద్భవ వైభవం

* మహా దేవునికి మహా నీరాజనం

* అద్భుత సాంస్కృతిక కార్యక్రమాలు

ఇలా ఎన్నో విశేష కార్యక్రమాలక వేదికగా మారిన కోటిదీపోత్సవంలో పాల్గొనాల్సింది భక్తులకు ఆహ్వానం పలుకుతోంది రచనా టెలివిజన్‌.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా సాయంత్రం 5.30 గంటలకు మహాదీపయజ్ఞం ప్రారంభంకానుంది.. భక్తులకు పూజాసామాగ్రిని కూడా భక్తులకు అందజేస్తోంది రచనా టెలివిజన్‌.. కార్తిక మాసం, నాగుల చవిత వేళ.. కోటిదీపోత్సవంలో పాల్గొనండి.. ఆ మహాదేవుడి కృపకు పాత్రులుకండి..

Show comments