Site icon NTV Telugu

Korean Minister : ఇఫ్ఫీ స్టేజ్‌పై ‘వందేమాతరం’ పాడిన కొరియన్ మినిస్టర్ – సోషల్ మీడియాలో వీడియో వైరల్!

Korean Minister Sings ‘vande Mataram’

Korean Minister Sings ‘vande Mataram’

56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వేడుకల్లో విశేషం చోటుచేసుకుంది. గోవాలో నిర్వహిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక వేడుక ప్రారంభోత్సవ కార్యక్రమంలో కొరియా రిపబ్లిక్ నేషనల్ అసెంబ్లీ సభ్యురాలు జావెన్ కిమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారతీయులకు ఎంతో గర్వకారణమైన ‘వందేమాతరం’ గేయాన్ని ఆమె స్టేజ్‌పై అద్భుతంగా ఆలపించి కార్యక్రమానికి హాజరైన వారిని అబ్బురపరిచారు. కొరియన్ మినిస్టర్‌ స్వరంలో వచ్చిన వందేమాతరం శ్రోతల్లో దేశభక్తి స్పూర్తిని నింపగా, అక్కడి వేదికపై ప్రేక్షకులు ఘనంగా చప్పట్లతో స్పందించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. విదేశీ అతిథి భారతీయ జాతీయ గేయాన్ని ఇంత అందంగా ఆలపించడం నెటిజన్స్‌ను ఆకట్టుకుంటోంది. కొరియా-ఇండియా సాంస్కృతిక అనుబంధాన్ని ప్రతిబింబించే ఈ క్షణం ఇఫ్ఫి వేడుకలలో ప్రత్యేక హైలైట్‌గా మారింది.

 

Exit mobile version