Site icon NTV Telugu

Koragajja Movie : రీల్స్ చేయండి కోటి సంపాదించండి!

Koragajja

Koragajja

డైరెక్టర్ సుధీర్ అట్టావర్ తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ ‘కొరగజ్జ’ సినిమా టీం సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది, కేవలం సినిమా పాటలతో రీల్స్ చేసి, ఏకంగా ₹1 కోటి*విలువైన బహుమతులను గెలుచుకునే అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. న్యూ ఇయర్ కానుకగా విడుదలైన ఈ చిత్ర ఆడియో ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోందనే చెప్పాలి. ప్రస్తుతం ఎక్కడ చూసినా షార్ట్ వీడియోలు, రీల్స్ ట్రెండ్ నడుస్తోంది, దీనిని దృష్టిలో ఉంచుకుని ‘కొరగజ్జ’ చిత్ర యూనిట్ ఒక వినూత్నమైన పోటీని ప్రారంభించింది. ఈ చిత్రంలోని పాటలకు మీ స్టైల్‌లో క్రియేటివ్ రీల్స్ రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే, జిల్లా- రాష్ట్ర స్థాయిల్లో కలిపి మొత్తం ₹1 కోటి విలువైన బహుమతులు సొంతం చేసుకోవచ్చు.

Also Read :Crazy Kalyanam: “క్రేజీ (కాంబినేషన్) కల్యాణం”.. ఇదేదో కొట్టేలా ఉందే!

పోటీలో పాల్గొనడం ఎలా?

1. ‘కొరగజ్జ’ చిత్రంలోని పాటలను ఎంచుకుని మీ క్రియేటివిటీతో రీల్స్ చేయండి.
2. మీ వీడియోలను @sudheer.attavar, @vidyabejai, @trivikramsapalya అకౌంట్స్‌కు ట్యాగ్ చేయండి.
3. ఎక్కువ వ్యూస్, లైక్స్ మరియు కామెంట్స్ సాధించిన వీడియోలకు బహుమతులు దక్కుతాయి.
4. ప్రతి వారం జిల్లా స్థాయిలో ప్రత్యేక గిఫ్ట్స్ కూడా అందజేస్తారు.

వీడియోలు గౌరవప్రదంగా ఉండాలి. ఎగతాళి చేసేలా లేదా అసభ్యకరంగా ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. హోటల్ హాలిడే ఇన్ వేదికగా, Big FM 92.7 భాగస్వామ్యంతో జరిగిన ఈ చిత్ర ఆడియో వేడుక సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగింది, అంతర్జాతీయ పాప్ సింగర్ షారన్ ప్రభాకర్, సీనియర్ నటి భవ్య, దర్శకుడు నాగతిహళ్లి చంద్రశేఖర్ వంటి వారు ఈ వేడుకలో సందడి చేశారు. ప్రస్తుతం 300కి పైగా ఆడియో ప్లాట్‌ఫామ్‌లలో ఈ పాటలు అందుబాటులో ఉన్నాయి.

Exit mobile version