Site icon NTV Telugu

CM Revanth Reddy: సీఎం రేవంత్‌ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లె సర్పంచ్‌ ఏకగ్రీవం..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: సీఎం రేవంత్‌ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లె సర్పంచ్‌ ఏకగ్రీవమైంది.. ఎస్సీకి రిజర్వ్‌ అయిన కొండారెడ్డిపల్లె సర్పంచ్‌ పదవికి 15 మంది పోటీ పడ్డారు. చివరికి సర్పంచ్‌ ఎన్నికను గ్రామ పెద్దలు ఏకగ్రీవం చేశారు.. 15 మందిలో ఒకరి పేరును సీల్డ్‌ కవర్‌లో ప్రకటించనున్నారు. ఎవరి పేరు వచ్చినా గ్రామం మొత్తం సమిష్టిగా ఆ నిర్ణయాన్ని గౌరవించాలనేది గ్రామ నాయకత్వం అభిప్రాయంగా చెబుతున్నారు.

READ MORE: I – Bomma Ravi : మూడో రోజు ఐబొమ్మ రవి కస్టడీ.. పోలిసులకు సహకరించని రవి

మరోవైపు.. మొదటి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల గడువు నేటితో పూర్తి కానుంది. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తున్నట్టు అధికారులు తెలిపారు. గురువారం నుంచి నామినేషన్లు స్వీకరిస్తుండగా నిన్న సర్పంచి పదవులకు 4,901 నామినేషన్లు వచ్చాయి. దీంతో మొత్తం నామపత్రాల సంఖ్య 8,198కి చేరింది. అటు మొన్న, నిన్న కలిపి వార్డు సభ్యులకు 11,502 నామినేషన్లు దాఖలైనట్టు అధికారులు వెల్లడించారు. తొలి విడతలో 4,236 సర్పంచ్‌, 37,440 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ డిసెంబర్ 3. డిసెంబర్ 11న మొదటి దశ ఎన్నికలు జరుగుతాయి. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

READ MORE:Renu Desai : నన్ను వదిన అని పిలవద్దు.. జానీ మాస్టర్‌కి రేణు దేశాయ్ సీరియస్ వార్నింగ్

Exit mobile version