ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర. అయితే.. సమ్మక్క, సారలమ్మ జాతర సమీపిస్తుండటంతో ఇవాళ మేడారంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ పర్యటించారు. ఈ సందర్భంగా మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలకు దర్శించుకున్నారు మంత్రులు కొండా సురేఖ, దనసరి సీతక్క.. అయితే.. సమ్మక్క సారలమ్మ దేవతలకు పసుపు, కుంకుమ, బెల్లం, చీరె, సారే నైవేద్యంగా పెళ్లి కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించుకున్నారు మంత్రి కొండా సురేఖ. అనంతరం జాతరకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారుల చేస్తున్న ఏర్పాటలను వారు పరిశీలించారు.
అయితే, జాతర మొదలయ్యేందుకు ఇంకా నెల రోజులు సమయం ఉన్నా అమ్మవార్ల దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. భక్తులు ముందుగా స్థానిక జంపన్న వాగులో స్నానా చేసి, తలనీలాలు సమర్పించుకుని దేవతలకు మొక్కులు చెల్లిస్తున్నారు. కాగా ఫిబ్రవరి 21 నుంచి నాలుగు రోజుల పాటు జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను విజయవంతంగా జరిపించాలని మంత్రులు సీతక్క, సురేఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం విడుదల చేసిన రూ.75 కోట్ల నిధులతో మొదలు పెట్టిన పనులను నెలాఖరు లోగా పూర్తి చేయాలని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని ఆదేశించారు.