విభిన్న కథలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కోన వెంకట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఆయన గీతాంజలి సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. క్యూట్ హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ సీక్వెల్‌ను ఇటీవలే అధికారికంగా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఎంవీవీ బ్యానర్ మరియు కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థ సంయుక్తంగా ఈ హార్రర్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నాయి. ఇటీవల పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ను పట్టాలెక్కించారు. ఈ సందర్భంగా స్క్రిప్ట్‌ని ఎంవీవీ సత్యనారాయణ మరియు కోన వెంకట్ సంయుక్తంగా డైరక్టర్ శివ తుర్లపాటికి అందజేశారు.ఈ సినిమాలో శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ మరియు రవి శంకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నిర్మాతగానే కాకుండా గీతాంజలి 2 సినిమాకు కోన వెంకట్ కథ-స్క్రీన్ ప్లే ను కూడా అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఆయన తన సొంత గ్రామంలో పర్యటించారు. బాపట్ల జిల్లా కర్లపాలెంలోని ప్రభుత్వ పాఠశాలను ఆయన సందర్శించారు. స్కూల్ అంతా తిరిగి చూసిన ఆయన ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన తరగతి గదులను పరిశీలించారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. ట్విట్టర్ వేదికగా స్కూల్ సందర్శనకు సంబంధించిన ఫొటోలు షేర్ చేసిన కోన వెంకట్ ‘నా సొంత ఊర్లో ఇంతటి అద్భుతమైన ప్రభుత్వ పాఠశాల ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. పాఠశాలలో కల్పించిన మౌలిక సదుపాయాలు నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి ‘ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం కోన వెంకట్ షేర్ చేసిన ఫొటోలు అలాగే ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట బాగా వైరల్ గా మారాయి. ‘జగనన్న సంక్షేమ పాలనకు ఇది ప్రత్యక్ష నిదర్శనం’ అంటూ వైఎస్సార్ సీపీ అభిమానులు మరియు కార్యకర్తలు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Very happy and surprised to see a beautiful Government School in Karlapalem which is part of my Hometown Bapatla!! pic.twitter.com/QdwENpKnem
— KONA VENKAT (@konavenkat99) January 29, 2024
