Site icon NTV Telugu

Komuravelli Mallanna Jatara 2026: నేటి నుంచి కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు

Komuravelli

Komuravelli

Komuravelli Mallanna Jatara 2026: కొంగు బంగారమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి జాతర ఈరోజు (జనవరి 18) నుంచి ప్రారంభం కానుంది. అయితే, సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో ప్రారంభమై ఉగాదికి ముందు వచ్చే ఆదివారం నాడు ముగియనుంది. సుమారు రెండున్నర నెలల పాటు ఈ జాతర జరుగుతుంది. ప్రతి ఆదివారం విశేష కార్యక్రమాలు కొనసాగిస్తారు. బోనాలతో భక్తులు ఆలయానికి వెళ్లి స్వామి, అమ్మవార్లకు నైవేథ్యం సమర్పించనున్నారు. ఇక, పట్నం వేసి కల్యాణం జరిపించి తమ మొక్కులు తీర్చుకుంటారు. వీటిలో నాలుగు ప్రధాన ఘట్టాలతో పాటు మరో రెండు వేడుకలు కూడా జరుపుతారు. అయితే, ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వస్తారు. ఇక, వీరిలో హైదరాబాద్‌కు చెందిన భక్తులే అత్యధికంగా ఉంటారు. అందుకే తొలి ఆదివారాన్ని పట్నం వారంగా పిలుస్తుంటారు. అలాగే, సోమవారం తోటబావి సమీపంలోని కల్యాణ వేదిక దగ్గర సొంత ఖర్చులతో పట్నం, అగ్నిగుండం కార్యక్రమాలు జరుపుతారు. ఈ వేడుకకు 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది ఆలయానికి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

READ MORE: Dhurandhar: ఆరు వారాలైనా తగ్గని ‘ధురంధర్’ దూకుడు.. 43వ రోజు భారీ కలెక్షన్స్!

Exit mobile version