Site icon NTV Telugu

Komatireddy Venkat Reddy: మొంథా తుఫాను ఎఫెక్ట్.. తెలంగాణలో దెబ్బతిన్న 230 కి.మీ రోడ్లు..!

Cyclone Montha Turns Into D

Cyclone Montha Turns Into D

Komatireddy Venkat Reddy: మొంథా తుఫాను ఎఫెక్ట్ తో ఆర్‌ అండ్‌బీ రోడ్లు 334 లోకేషన్స్‌లో 230 కి.మీ దెబ్బతిన్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. రోడ్లు భవనాలు శాఖ పూర్తి అప్రమత్తంగా ఉందని వెల్లడించారు. తాజాగా తుఫాన్ ఎఫెక్ట్స్‌పై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి మాట్లాడారు. నిన్న అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు.. దెబ్బతిన్న, కోతకు గురైన రోడ్లు, బ్రిడ్జిలు, కాజ్‌వేల తాత్కాలిక పునరుద్ధరణకు సుమారు రూ. 7కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు రూ. 225 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు అంచనాలు రూపొందించినట్లు స్పష్టం చేశారు. తుఫాన్ వల్ల అకాల వర్షాలతో ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వరి, పత్తి పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయని తెలిపారు.

READ MORE: Israel-Pakistan: ఇజ్రాయిల్‌తో పాకిస్తాన్ స్నేహం.. నమ్మడం కష్టమైనా ఇదే నిజం..

“వరి ధాన్యం సుమారు 2లక్షల మెట్రిక్ టన్నులు ఐకేపీ సెంటర్లో ఉంది. మన ప్రజా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం.. తడిసిన ధాన్యాన్ని కూడా కొని వెంటనే మిల్లులకు తరలించేలా ముఖ్యమంత్రి, సివిల్ సప్లై మినిస్టర్ చొరవ చూపాలి. సేకరించిన ధాన్యం వెంటనే మిల్లులకు తరలించేలా.. మిల్లర్లు వెంటనే ఆ ధాన్యాన్ని తీసుకునేలా చూడండి.. పత్తి తేమ శాతానికి సంబంధించి ఇప్పటికే సీసీఐ ఛైర్మన్ లలిత్ కుమార్ గుప్తాను ముంబై వెళ్లి మరి కలిసి రైతుల పక్షాన ప్రత్యేక విజ్ఞప్తి చేశాను.. తేమ శాతంలో సడలింపులు ఇచ్చి తెలంగాణ పత్తి రైతులను ఆదుకోవాలని కోరాను. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన ఉమ్మడి నల్గొండ జిల్లా రైతాంగంపై ప్రత్యేక దృష్టి సారించి వారిని ఆదుకోవాలని ముఖ్యమంత్రి కి రిక్వెస్ట్ చేస్తున్నాం.” అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Exit mobile version