MLA Komati Reddy Rajagopal Reddy: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. నేడు తన పుట్టిన రోజు సందర్బంగా తిరుమల శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారా..? లేక వైసీపీకీ పట్టం కడతారోనన్న ఉత్కంఠ నెలకొందని మొట్టమొదటిసారిగా ఏపీలో ప్రజల నాడి ఎవరికీ అంతుబట్టడం లేదన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్.. బీజేపీ మధ్య హోరా హోరీ పోరు జరిగిందని బీఆర్ఎస్ తుడుచు పెట్టుకుపోయిందన్నారు.
AP Election Results: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే
Show comments