Site icon NTV Telugu

సోనియాను దెయ్యం అన్న వాళ్లు కాంగ్రెస్ లోనే ఉన్నారు : రేవంత్ కు కోమటి రెడ్డి కౌంటర్ !

సోనియా గాంధీ ఒక దేవత అని.. కానీ కాంగ్రెస్‌ పార్టీలోనే కొంత మంది ఆమె దెయ్యం అన్నారని రేవంత్‌ రెడ్డికి చురకలు అంటించారు పార్లమెంట్‌ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇవాళ కాంగ్రెస్ నేత వి. హనుమంతరావుతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ… ఇందిరా గాంధీ చేయని దైర్యం సోనియా గాంధీ చేశారని..తెలిపారు. తానేమి పెద్ద నాయకుడిని కాదన్నారు.

రైతులు ధాన్యం కొనకపోతే అనారోగ్యం తో వెంకన్న అనే రైతు చనిపోయాడని… టోకెన్ల కోసం జిల్లాల్లో బార్లు తీరుతున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్‌కు హుజూరాబాద్ ఓడిపోయమని బాధ ఉండొచ్చని.. వెయ్యి కోట్లు ఖర్చు చేసి ఓడిపోయా అనే బాధ కామన్ అని వెల్లడించారు.

దీపావళి పండగ పూట… రైతు చనిపోయాడని.. రైతుల బాధ పట్టించుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతు తిరగపడితే… దేశం గడగడ లాడుతుందని… కొనుగోలు కేంద్రాలు పెంచాలన్నారు. తాను రాజకీయాలు మాట్లాడనని..వీహెచ్‌ అంటే తనకు అభిమానమన్నారు. పార్టీ కోసం ప్రాణం ఇచ్చే నాయకుడు వీహెచ్‌ అని… కొనియాడారు. సోనియా, రాహుల్ తమ నాయకులు అని…వీహెచ్ లాంటి వాళ్ళను గౌరవిస్తానని స్పష్టం చేశారు.

Exit mobile version