Site icon NTV Telugu

Medak: కోమటిపల్లి మోడల్ స్కూల్ ఫుడ్ పాయిజన్ ఘటన.. నలుగురిపై చర్యలు

Food Poisoin

Food Poisoin

మెదక్ జిల్లా రామాయంపేట తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్‌లో ఉదయం ఫుడ్ పాయిజన్ అయిన సంగతి తెలిసిందే.. ఈ ఘటనలో 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే రామాయంపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆహారంలో బల్లి పడడం వల్లే ఫుడ్ పాయిజన్ అయిందని విద్యార్థులు చెబుతున్నారు. మరోవైపు.. ఈ ఘటన పై పాఠశాల విద్యాశాఖ సీరియస్ అయింది. నలుగురిపై చర్యలు తీసుకున్నారు.

Read Also: Konda Surekha: బల్కంపేట తోపులాట ఘటన వెనుక కుట్ర కోణం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

ఉదయం విద్యార్థులకు అల్పాహారంలో బల్లి పడటంతో ముందే విద్యార్థి గమనించాడని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తెలిపారు. అల్పాహారాన్ని తినకూడదని తోటి విద్యార్థి చెప్పాడు.. అప్పటికే 17 మంది విద్యార్థులు అల్పాహారం చేశారన్నారు. ఆ తర్వాత వాంతులు విరోచనాలు కావడంతో దగ్గరలోని రామాయంపేట ప్రైమరీ హెల్త్ సెంటర్ కు తీసుకెళ్లి డాక్టర్ల చేత పరీక్షలు చేయించడం జరిగిందని పేర్కొన్నారు. మిగతా 70 మంది విద్యార్థులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు.. ఇద్దరు విద్యార్థులకు కడుపునొప్పి రావటంతో అబ్జర్వేషన్ లో ఉంచారన్నారు. విద్యార్థులు అందరూ కూడా క్షేమంగా ఉన్నారు.. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. పాఠశాలలోని వంట మనిషి వంట సహాయకులను విధుల నుంచి తొలగించామని పేర్కొన్నారు. మోడల్ స్కూల్ కేర్ టేకర్ తో పాటు.. మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్స్ స్పెషల్ ఆఫీసర్లకు షోకాస్ నోటీస్ జారీ చేశామని విద్యాశాఖ డైరెక్టర్ తెలిపారు.

Read Also: Sikhs For Justice: ఖలిస్తానీ ఉగ్రసంస్థ ‘సిక్స్ ఫర్ జస్టిస్’’పై మరో 5 ఏళ్లు బ్యాన్..

Exit mobile version