Kolkata Knight Riders Vs Mumbai Indians: ఐపీఎల్ లో నేడు కోల్‌కతా నైట్ రైడర్స్ తో ముంబై ఇండియన్స్ తలపడబోతుంది. ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రాత్రి 7.30 గంటలకు జరగనుంది. ఓ వైపు, కేకేఆర్ ప్లేఆఫ్స్‌లో తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు రెడీ కాగా.. మరోవైపు, టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన మొదటి టీమ్ ముంబై ఇండియన్స్ నిలిచింది. అయితే, కోల్‌కత్తా 8 విజయాలతో పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉండగా.. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై 4 విజయాలు, 8 ఓటములతో 8వ స్థానంలో కొనసాగుతుంది. కేకేఆర్ ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే కేవలం ఒక్క మ్యాచ్ లో గెలిస్తే చాలు.. ఇక, ముంబై ఇప్పటికే టాప్ 4 రేసు నుంచి నిష్క్రమించింది.
Read Also: Pawan kalyan : నా భార్యను తిట్టారు.. పవన్ ఎమోషనల్ కామెంట్స్..
ఇక, ఐపీఎల్ చరిత్రలో ముంబై, కోల్‌కతా మధ్య 33 మ్యాచ్‌లు జరగ్గా అందులో ముంబై 23 మ్యాచ్‌లు గెలవగా.. కేకేఆర్ కేవలం 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈడెన్ గార్డెన్స్‌లో ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు జరిగాయి.. అందులో ముంబై 7 గెలివగా, కోల్ కతా 3 మ్యాచ్ లను గెలిచింది. ప్రస్తుతం కేకేఆర్ ఫామ్ చూస్తుంటే ముంబైపై కోల్‌కత్తాదే పైచేయి కనిపిస్తోంది. ఇక, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాట్స్‌మెన్‌లు ఆరంభంలో దూకుడిగా ఆడే అవకాశం ఉంటుంది. స్పిన్ బౌలర్లకు కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఈడెన్ గార్డెన్స్‌లో సగటు స్కోరు దాదాపు 160గా ఉంది. అయితే, 25 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుందని వాతావరణం శాఖ తెలిపింది. ఇక, సెకండ్ ఇన్సింగ్స్ సమయానికి డ్యూ కూడా తక్కువగా వచ్చే అవకాశం ఉంది.
Read Also: Bihar: కాంగ్రెస్ అభ్యర్థి, తన కొడుకుపై ఫోక్సో కేసు.. కుమారుడి అరెస్ట్
ఇరు జట్లు అంచనా:
కోల్‌కత్తా నైట్ రైడర్స్: ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రమణదీప్ సింగ్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, వరుణ్ చక్రవర్తి, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా.
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నెహాల్ వధేరా, టిమ్ డేవిడ్, అన్షుల్ కాంబోజ్, పీయూష్ చావ్లా, నువాన్ తుషార, జస్ప్రీత్ బుమ్రా.
