కోల్‌కతా నైట్ రైడర్స్ ఇవాళ (ఏప్రిల్ 26) రాత్రి 7:30 గంటలకు ఈడెన్ గార్డెన్స్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడతాయి. ఇక, ఈ మ్యాచ్ లో విజయం సాధించి ప్లేఆఫ్ లైన్ క్లియర్ చేసుకోవాలని ఇరు జట్లు చూస్తున్నాయి. అయితే, కేకేఆర్ వరుస విజయాలతో టెబుల్ సెకండ్ ప్లేస్ లో ఉండగా.. పంజాబ్ మాత్రం చివరి స్థానంలో ఉంది. ఈ ఐపీఎల్ టోర్నమెంట్లో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు కేవలం 32 సార్లు మాత్రమే పోటీ పడ్డాయి. అందులో కోల్‌కతా నైట్ రైడర్స్ 21 సార్లు విజయం సాధించగా.. పంజాబ్ కింగ్స్ మాత్రం 11 మ్యాచ్ ల్లో విజయాన్ని అందుకున్నాయి. ఇక, ఇవాళ్టి మ్యాచ్ లో కేకేఆర్ ఒక మార్పు చేస్తున్నట్లు తెలుస్తుంది. అది మిచెల్ స్టార్క్ స్థానంలో చమీర ఆడే అవకాశం ఉంది.
Read Also: ED Raids : ముంబైలో ఈడీ దాడులు.. రూ.73కోట్ల ఆస్తుల జప్తు
ఇక, కోల్‌కతా నైట్ రైడర్స్ తమ సొంత గ్రౌండ్ లో పంజాబ్ కింగ్స్‌తో తలపడడం ఇది 13వ సారి. గత 12 మ్యాచ్ ల్లో పంజాబ్ పై కేకేఆర్ 9 విజయాలను నమోదు చేయగా కేవలం మూడింట్లో మాత్రమే ఓడిపోయింది. ఐపీఎల్‌లో వరుసగా నాలుగు పరాజయాలతో ఇబ్బంది పడుతున్న పంజాబ్ కింగ్స్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. భుజం గాయంతో కెప్టెన్ శిఖర్ ధావన్ నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌కూ అందుబాటులో ఉండటం లేదు. ఈ నెల 9వ తేదీన హైదరాబాద్‌తో చివరి మ్యాచ్ ఆడిన శిఖర్ ధావన్ ఆ తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. పంజాబ్ కింగ్స్ టీమ్ కు సారథిగా సామ్ కరన్ వ్యవహరిస్తున్నాడు.