Kolkata Groom : కరోనా పుణ్యమాని చాలా కంపెనీలు ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసుకునే వెలుసుబాటును కల్పించాయి. ఇదేదో బాగుంది.. ఆఫీసు మెయింటెనెన్స్, ఇతరత్రా ఖర్చులు కూడా తగ్గడంతో చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్నే ఇంకా అమలు చేస్తున్నాయి. దీని వల్ల ఉద్యోగులు కాలం, కంపెనీలకు ఖర్చులు రెండూ కలిసి వస్తున్నాయి. కంపెనీల ఉత్పాదకత కూడా పెరుగుతోంది. కానీ… ఇటీవల ఓ పెండ్లి మండపంలో ల్యాప్‌టాప్‌తో పెండ్లికొడుకు కుస్తీ పడుతున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రాంలో @ఐజి_కోల్‌కతా షేర్ చేసింది.
Read Also: Chattarpur : స్టేజ్ పైనే చెప్పుతో కొట్టిన మహిళ.. షాక్ తిన్న నాయకులు
మండపంలో తాళిని పట్టుకోవాల్సిన చేతులతో ల్యాప్‌ట్యాప్‌ను పట్టుకున్నాడు. పెళ్లి జరిపించడానికి కూర్చున్న పంతుళ్లు.. వాళ్ల పని వాళ్లు చేశారు. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ అయింది. వర్క్ ఫ్రం హోం నెక్ట్స్ లెవెల్ ఇదేనంటూ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చారు. వైరల్‌గా మారిన ఈ పోస్ట్‌కు ఇప్పటివరకూ పదివేలకు పైగా లైక్స్ వచ్చాయి. అయితే దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఒకరైతే ‘విషపూరితమైన పని సంస్కృతిని ప్రచారం చేయవద్దు. ఇది గర్వించదగినది కాదు.’ అని కామెంట్ పెట్టారు. అలాగే ‘అతను ఏం కంపెనీలో పని చేస్తున్నాడో తెలుసుకోవాలనుకుంటున్నాను.’ అని ఒకరు కామెంట్ పెట్టారు.