Kolkata Doctor Autopsy Report: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు చెందిన 31 ఏళ్ల పోస్ట్‌గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. వైద్యురాలిపై అఘాయిత్యం జరిగిన తీరు ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచివేస్తోంది. నిందితులను అస్సలు వదిలిపెట్టొద్దని యావత్ దేశం ఆందోళన చేస్తోంది. అయితే ట్రైనీ డాక్టర్ పోస్ట్‌మార్టం నివేదిక గురించి మరిన్ని వార్తలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. వైద్యురాలిని దారుణంగా అత్యాచారం చేశారని, ఆమె శరీరంపై 14 చోట్ల గాయాలు ఉన్నాయని ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది.
ట్రైనీ డాక్టర్ శరీరంపై 14 చోట్ల గాయాలు ఉన్నాయని శవపరీక్షలో గుర్తించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. బలవంతంగా లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు ఉన్నాయని నివేదికలో ఉంది. బాధితురాలి తల, ముఖం, మెడ, చేతులు సహా జననాంగాలపై 14 గాయాలు ఉన్నట్లు పోస్ట్‌మార్టంలో గుర్తించారు. ఆమె ఊపిరితిత్తుల్లో అధిక మొత్తం రక్తస్రావం జరిగినట్లు తెలుస్తోంది. శవపరీక్ష నివేదిక ఆధారంగా ఆమె దారుణంగా అత్యాచారం మరియు హత్యకు గురైందట.
Also Read: Rohit Sharma: స్నేహితులతో చిల్ అవుతున్న రోహిత్.. పిక్స్ వైరల్!
అత్యాచార సమయంలో నిందితుడి సంజయ్ రాయ్‌తో వైద్యురాలు శక్తి మేరకు పోరాడి ఉంటుందని వైద్యులు పోస్ట్‌మార్టం నివేదికలో పేర్కొన్నారు. సంజయ్‌కి వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు.. అతడి శరీరంపై బాదితురాలు గోళ్లతో రక్కిన గుర్తులు కన్పించాయట. అలానే బాధితురాలి మృతదేహాన్ని పరిశీలించగా.. ఆమె గోళ్లలోని చర్మం, రక్త నమూనాలు నిందితుడి నమూనాలతో మ్యాచ్ అయ్యాయట. గొంతు నులిమి ఊపిరాడకుండా చేయడం వల్లే బాధితురాలు మృతిచెందినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో పేర్కొన్నారు.
