Site icon NTV Telugu

Kodali Nani: తనకు ఏమి కాలేదని క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే కొడాలి నాని..

Kodali Nani

Kodali Nani

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, వైస్సార్సీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారని., నేడు ఆయన తన స్వగృహంలో నందివాడ మండల పార్టీ నాయకులతో మాట్లాడుతూ సోఫాలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

PM Modi: “నేను జీవించి ఉన్నంత వరకు అది సాధ్యం కాదు”.. రిజర్వేషన్లపై ప్రధాని మోడీ..

ఆ సమయంలో అప్రమత్తమైన పార్టీ నేతలు, గన్‌మెన్లు ఆయనకు సపర్యలు చేసి., వెంటనే డాక్టర్లకు సమాచారం అందించారని వార్తలు వచ్చాయి. ఇక ఈ ఘటన జరిగిన సమయంలో ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేరని అంటూ రకరకాల వార్తల వచ్చాయి.

Shah Rukh Khan: ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన షారూఖ్.. ప్రత్యేక విమానంలో ముంబైకి ప్రయాణం

ఇక ఈ విషయల్నిటికి చెక్ పెడుతూ.. తాను ఎలాంటి అస్వస్థతకు గురి కాలేదని తాజాగా క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే కొడాలి నాని. తాను బాగానే ఉన్నానంటూ ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

Exit mobile version