ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్టు సిరీస్‌లో టీమ్ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు. మేనేజ్‌మెంట్ కోరితే తన ఓపెనింగ్ స్థానాన్ని వదులుకునేందుకు రెడీగా ఉన్నానని అన్నాడు. జట్టు అవసరం కోసం మిడిలార్డర్‌లోనైనా బ్యాటింగ్ చేస్తానని చెప్పాడు. ఈ సిరీస్ గెలవడం తమకు చాలా ముఖ్యమని, వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ చేరడమే తమ లక్ష్యమని రాహుల్ స్పష్టం చేశాడు. నాగ్‌పూర్ వేదికగా గురువారం నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టుతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో టీమిండియా కనీసం రెండు విజయాలు సాధిస్తేనే డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ దక్కుతుంది. ఈ క్రమంలోనే భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది.
Also Read: Shraddha Walkar Case: శ్రద్ధ హత్య కేసు ఛార్జిషీట్ లో సంచలన విషయాలు.. ఎముకలను పౌడర్ చేసే యత్నం
ఈ సిరీస్‌లో రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసేది ఎవరా? అనే చర్చ జోరుగా సాగుతోంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సెంచరీల మోత మోగించిన శుభ్‌మన్ గిల్‌నే ఓపెనర్‌గా ఆడించాలని హర్భజన్ సింగ్ వంటి మాజీ క్రికెటర్లు సూచించారు. ఇక తొలి టెస్టు నేపథ్యంలో మంగళవారం కేఎల్ రాహుల్ మీడియాతో మాట్లాడాడు. తుది జట్టు ఎంపికతో పాటు తన బ్యాటింగ్ పొజిషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Also Read: ICC Player Of The Month: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ రేసులో సిరాజ్, గిల్
“ఇంకా తొలి టెస్టు ఆడే తుది జట్టును నిర్ణయించలేదు. టీమ్‌లో ఇంకా కొన్ని ఖాళీలను పూర్తి చేయాల్సి ఉంది. నేను ఓపెనర్‌గానే రావాలని అనుకోవడం లేదు. జట్టు కోరితే మిడిలార్డర్‌లో ఆడడానికి కూడా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. భారత్ పిచ్‌ల్లో టర్నింగ్ ఉంటుంది కాబట్టి ముగ్గురు స్పిన్నర్లతో ఆడాలని మాత్రం అనుకుంటున్నాం. అయితే మ్యాచ్ ప్రారంభ రోజు పిచ్‌ను చూసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటాం. పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ చేస్తాం. స్వేచ్చగా షాట్లు ఆడే అవకాశం ఉంటే దూకుడుగా ఆడుతాం. లేదంటే రెగ్యులర్ టెస్ట్ క్రికెట్ బ్యాటింగ్ టెంప్లేట్ ఉపయోగిస్తాం. ఒక ప్లాన్‌తో బరిలో దిగి అలాగే ఆడాలని అనుకోవడం లేదు. గ్రౌండ్‌లోకి దిగిన తర్వాత ప్లాన్‌లో మార్పులు చేయాల్సి వచ్చినా చేయడానికి సిద్దంగా ఉంటాం” అని రాహుల్ వెల్లడించాడు.
Also Read: Nandamuri Kalyan Ram: ఆమె లేకపోతే నేను లేను.. అందుకే ఆ టాటూ