Site icon NTV Telugu

KL Rahul Marriage: నటి అతియా శెట్టి మెడలో మూడు ముళ్లు వేసిన కేఎల్ రాహుల్

Kl Rahul

Kl Rahul

KL Rahul Marriage: టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి గారాలపట్టి అతియా శెట్టి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబసభ్యుల సమక్షంలో వారి వివాహం ఘనంగా జరిగింది. ముంబయిలోని సునీల్ శెట్టికి చెందిన అత్యంత విలాసవంతమైన ఖండాలా ఫామ్‌హౌస్ వేదికగా రాహుల్ అతియాశెట్టిని వివాహమాడాడు. ఈ సందర్భంగా ఈ జంట పెళ్లి ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఈ ప్రేమజంటకు బాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు క్రికెటర్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఈ వివాహ వేడుకకు అతికొద్ది మంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు. బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌, క్రికెటర్‌ ఇషాంత్‌ శర్మ దంపతులు, వరుణ్ ఆరోన్‌ తదితరులు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అతియా శెట్టి, కేఎల్ రాహుల్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ పూర్తయిన తర్వాత రిసెప్షన్‌ ఏర్పాటు చేసే అవకాశముంది.

Vadakupatti Ramasamy: సంతానం హీరోగా ‘వడక్కుపట్టి రామసామి’

నూతన వధూవరులకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగా అతియా తన ఇన్‌స్టాలో రాహుల్‌తో ఉన్న బంధం గురించి చెప్పుకొచ్చింది. ఈ రోజు తమకు చాలా విలువైన రోజు అని.. ఎలా ప్రేమించాలో నేర్చుకుంటానని.. సన్నిహితుల మధ్య మేం ఒక్కటయ్యామని.. ఇది మా జీవితంలో మరిచిపోలేని ఆనందాన్నిచ్చిందని.. మీ కృతజ్ఞతలు, ప్రేమ, ఆశీర్వాదాలు మా ప్రయాణంలో తోడుగా ఉంటాయని కోరుకుంటున్నామని అతియా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

 

Exit mobile version